మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ ఫైట్

కరోనా కల్లోలంలోనూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో నెట్టుకొస్తున్న సీఎం జగన్ ఇక ఎంత మాత్రం అలా కొనసాగించడం కష్టం అని బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు. కరోనా కల్లోలం వేళ నిర్వహిస్తున్న ఈ బడ్జెట్ సమావేశాలు వాడి వేడి వాదనకు వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా జగన్-చంద్రబాబు ఫైట్ పీక్ స్టేజీకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు ఏడాది […]

Written By: NARESH, Updated On : May 12, 2021 6:18 pm
Follow us on

కరోనా కల్లోలంలోనూ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ తో నెట్టుకొస్తున్న సీఎం జగన్ ఇక ఎంత మాత్రం అలా కొనసాగించడం కష్టం అని బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యారు. కరోనా కల్లోలం వేళ నిర్వహిస్తున్న ఈ బడ్జెట్ సమావేశాలు వాడి వేడి వాదనకు వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇప్పటికే జగన్ పాలనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అసెంబ్లీ వేదికగా జగన్-చంద్రబాబు ఫైట్ పీక్ స్టేజీకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు ఏడాది విరామం తర్వాత ఏపీలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బడ్జెట్ ఆమోదం కోసమే ఈ సమావేశాలు పెడుతున్నారు.

ప్రస్తుతం జగన్ ప్రభుత్వం రోజువారీ ఖర్చుల కోసం కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి నిధులను తీసుకోవటానికి, మూడు నెలల కాలానికి ఓటు-ఆన్-అకౌంట్ బడ్జెట్ ను ఆర్డినెన్స్  ద్వారా ఆమోదించింది. అవి మేతో ముగిస్తాయి.  అసెంబ్లీ సెషన్ ఎన్ని రోజులు నిర్వహించాలో   సలహా కమిటీ నిర్ణయిస్తుంది. ఇందులో సాధారణ బడ్జెట్‌ను ఆమోదించడం లక్ష్యంగా ఒక చిన్న సెషన్ నిర్వహిస్తారని తెలుస్తోంది.

ఇప్పటికే ఈ కరోనా కల్లోలంతో ఏపీలో బడ్జెట్ సమావేశాలు లేకుండా పోయాయి. వరుస ఎన్నికలు కూడా అసెంబ్లీ పెట్టకుండా ఆపేశాయి.  దీంతో ఇప్పుడు సుధీర్ఘ నిరీక్షణ తర్వాత మే 20 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోవిడ్ కల్లోలంలో ఎంత మంది ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నది వేచిచూడాలి.