ఇవ్వన్నీ పొందటానికే నిన్నా మొన్నటి వరకు అందాల భామలు అందరూ మాల్దీవుల బాట పట్టి, అక్కడ రెచ్చిపోయి మరీ అందాలతో కనువిందు చేయడం బాగా అలవాటు చేసుకున్నారు. ఒకపక్క దేశంలో తన విలయతాండవంతో కరోనా రోజురోజుకు జనాన్ని నిర్ధాక్షిన్యంగా బలి తీసుకుంటుంటే.. హీరోయిన్లు మాత్రం ఏం పట్టనట్టు చక్కగా మాల్దీవుల బీచుల్లో రెండు పీలికలు వేసుకుని డిఫెరెంట్ డిఫెరెంట్ యాంగిల్స్ లో దర్శనం ఇస్తూ కవ్వించేవారు.
కానీ, ఈ విషయంలో హీరోయిన్ల తీరు పై చాలా విమర్శలు వచ్చినా.. ఒక్క హీరోయిన్ కూడా వివరణ ఇచ్చే కనీస ప్రయత్నం కూడా చేయలేదు. ఓ దశలో బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికి లాంటి నటుడు కూడా విసిగిపోయి, హీరోయిన్ల పై సీరియస్ అవుతూ.. ‘ఈ కరోనా కష్టకాలంలో పడి ప్రజలు తిండి లేక, ఆకలి చావులతో, రోగాల బారిన పడి, సరైన వైద్యం లేక లక్షలాది మంది ప్రాణాలను పోగొట్టుకుంటుంటే.. మీరు మాత్రం బికినీలు ధరించి కసి కసి చూపులతో ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకుంటారా ? మీకు సిగ్గులేదా ? అంటూ హీరోయిన్ల పై ఆయన ఓ రేంజ్ లో కోపాన్ని చూపించాడు.
అయినా హీరోయిన్లు మాత్రం తమ మాల్దీవుల ట్రిప్ ను మానుకోలేదు. కానీ, ఇప్పుడు వాళ్లకు మాల్దీవులకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. భారత్ లో రోజురోజుకు కరోనా ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో.. భారతీయులెవ్వరికీ తమ దేశంలోకి ఎంట్రీ లేదని మాల్దీవులు అధికారికంగా ప్రకటించి.. మొత్తానికి హీరోయిన్లను నిరాశ పరిచింది. రేపటి నుంచి అనగా మే 13, 2021 నుండి భారతీయులెవ్వరూ మాల్దీవులలోకి ప్రవేశించలేరు. దీంతో అందాల భామలందరూ అందాల పరచడానికి ఇప్పుడు మరో ప్లేస్ ను వెతుక్కోవాల్సిందే.