https://oktelugu.com/

ఎక్స్ క్లూజివ్ : ఎన్టీఆర్ తో సినిమా ముచ్చట్లు !

మీడియా ప్రముఖులతో తాజాగా జూమ్ కాల్ లో ముచ్చటించిన ‘ఎన్టీఆర్’, తన తరువాత సినిమాల పై క్లారిటీ ఇచ్చారు. భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్ ను కొరటాల శివతో చేయబోతున్నట్లు, అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఫుల్ స్క్రిప్ట్ పూర్తి కాలేదు అని, జస్ట్ ఒక ఐడియా మాత్రమే తమ దగ్గర ఉందని, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్‌ పై పని చేస్తున్నామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. అలాగే కెజిఎఫ్ దర్శకుడు […]

Written By:
  • NARESH
  • , Updated On : May 12, 2021 / 05:49 PM IST
    Follow us on

    మీడియా ప్రముఖులతో తాజాగా జూమ్ కాల్ లో ముచ్చటించిన ‘ఎన్టీఆర్’, తన తరువాత సినిమాల పై క్లారిటీ ఇచ్చారు. భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత వెంటనే తన తదుపరి ప్రాజెక్ట్ ను కొరటాల శివతో చేయబోతున్నట్లు, అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి ఫుల్ స్క్రిప్ట్ పూర్తి కాలేదు అని, జస్ట్ ఒక ఐడియా మాత్రమే తమ దగ్గర ఉందని, ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్‌ పై పని చేస్తున్నామని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

    అలాగే కెజిఎఫ్ దర్శకుడు ‘ప్రశాంత్ నీల్‌’తో కూడా తానూ ఒక సినిమా చేస్తున్నానని, కొరటాల శివతో సినిమా పూర్తి చేయగానే, ప్రశాంత్ తో సినిమా స్టార్ట్ చేస్తానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ మాదిరిగానే తన తరువాత సినిమాలు కూడా, భారతదేశం అంతటా విడుదల అవుతాయని ఎన్టీఆర్ స్పష్టం చేశాడు. అంటే తారక్ ఇక నుండి తన ప్రతి సినిమాని పాన్ ఇండియా రేంజ్ లోనే ప్లాన్ చేస్తున్నాడు అన్నమాట.

    ఈ విషయంలో ఎన్టీఆర్ ముందుచూపును మెచ్చుకొని తీరాలి. ‘ఆర్ఆర్ఆర్’తో తనకొచ్చే పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎన్టీఆర్ సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న విధానం, నిజంగా చాల పర్ఫెక్ట్ గా ఉంది. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాల తరువాత ఎన్టీఆర్ డైరెక్టర్ అట్లీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. అంటే, ప్రశాంత్ నీల్ సినిమాతో కన్నడ మార్కెట్ పై,

    డైరెక్టర్ అట్లీ సినిమాతో తమిళ ప్రజానీకానికి తన నటనా చాతుర్యాన్ని చూపించి అక్కడ కూడా స్టార్ స్టేటస్ సంపాధించాలనేది ఎన్టీఆర్ ప్లాన్. ఆ తరువాత ఓ బాలీవుడ్ బడా దర్శకుడితో కూడా ఓ సినిమాని తారక్ ప్లాన్ చేశాడని టాక్ నడుస్తోంది. ఏమైనా ఎన్టీఆర్ ప్లానింగ్ చాల క్లియర్ గా ఉంది. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్ ఒక్కడే పాన్ ఇండియా రేంజ్ ను జాగ్రత్తగా మ్యానేజ్ చేసేలా కనిపిస్తున్నాడు.