Niti Aayog report: దేశంలో అత్యంత పేదరిక స్టేట్లలో బిహార్ ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడ 51 శాతం మంది పేదలు ఉన్నట్లు తెలుస్తోంది. తరువాత స్థానాల్లో జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ స్టేట్లు కొనసాగుతున్నాయి. దేశంలో అత్యంత దుర్భరమైన ప్రాంతాల్లో బిహార్ ఒకటి అని తెలుస్తోంది. అక్కడ పాలన అంతా అస్తవ్యస్తంగా ఉందని తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పేదరికం క్రమంగా పెరుగుతోంది. నీతి ఆయోగ్ కీలక విషయాలు వెల్లడించింది.
దేశంలో పేదరికం కూడా క్రమంగా పెరుగుతూ పోతున్నట్లు తెలుస్తోంది. పేదలు పేదలుగానే ఉంటున్నారు. ధనవంతులు మాత్రం ధనికులుగా మారిపోతున్నారు. సంపన్నులుగా చలామణి అవుతున్నారు. ప్రస్తుతం అనిల్ అంబానీ కంటే అదానీ సంపద పెరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంపద ఏ కొందరి చేతుల్లోనే మగ్గుతూ పేదవాడు మాత్రం ఇంకా కిందికి దిగజారుతున్నట్లు సమాచారం.
Also Read: CM KCR: ఢిల్లీ టూర్‌తో ఫెయిల్ తో మౌనంగా సీఎం.. కొత్త ప్లాన్ ఏంటి ?
తెలంగాణలో కూడా 13 శాతం మంది పేదలున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇక ఏపీలో మాత్రం 12 శాతం మంది మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ 18వ స్థానం కాగా ఆంధ్రప్రదేశ్ ది 20వ స్థానం అని సమాచారం. దీంతో తెలంగాణలోనే పేదలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.
పౌష్టికాహార లోపం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బిహార్ దే అగ్రస్థానం. దీంతో దేశంలో పౌష్టికాహార సమస్య కూడా జఠిలంగానే ఉంటోంది. పేదరికం పెరిగిపోతుండటంతో ప్రజలు కూడా ఇబ్బందుల్లో పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో పేదరికం ప్రబలంగా అభివృద్ధి చెందుతోందని తెలుస్తోంది.
Also Read: Jagan Mohan Reddy’s Big Blunder: సీఎం జగన్ పెద్ద తప్పు చేశాడా?