Vundavalli: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కంటనీరు పెట్టుకోవడంపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. చంద్రబాబు మనస్తత్వం తనకు తెలుసని ఊరికే సానుభూతి కోసం అంతలా దిగజారిపోయే వారు కాదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆపద సమయాల్లోనే ఏడ్చేవాడు కాదని తెలుస్తోంది. అలిపిరిలో బాంబు దాడి జరిగినప్పుడు ఒళ్లంతా గాయాలైనా కన్నీరు కార్చిన దాఖలాలు కనిపించలేదు. అలాంటిది విమర్శలకు ఇంతలా ఏడుస్తారనుకుంటే పొరపాటే. దీనిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సమాధానం చెప్పారు.
ఎన్నికల్లో గెలవాలంటే కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు. గతంలో వైఎస్సార్ చనిపోయినప్పుడు కూడా సానుభూతి పని చేయలేదని తెలుస్తోంది. ఒక్క రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మాత్రమే సానుభూతి పనిచేసిందని చెబుతున్నారు. చంద్రబాబు కన్నీరు పెట్టుకోవడం ఓ డ్రామాగా పేర్కొనడంలో అర్థం లేదు. అంత చిన్న విషయానికి స్పందించాల్సిన పని లేదు.
వైసీపీ నేతల్లో కూడా సహనం కోల్పోతోందని తెలుస్తోంది. వ్యక్తిగత జీవితంపై నిందలు వేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూడటం దారుణం. సభల్లో హుందాగా ఉండాల్సిన నేతలు దారి తప్పుతూ అనవసరంగా విమర్శలకు దిగుతున్నారు. దీంతో వారి స్థాయి కూడా తగ్గుతోందని సమాచారం.
Also Read: Jagan Mohan Reddy’s Big Blunder: సీఎం జగన్ పెద్ద తప్పు చేశాడా?
రాబోయే ఎన్నికల్లో వైసీసీకి కష్టకాలమే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తెలకు సంఘంలో గౌరవం ఉన్న మాట వాస్తవమే. కానీ ఈ మధ్య వారిని సైతం విమర్శల్లోకి లాగడం రాజకీయ తప్పిదంగానే తెలుస్తోంది. అయినా అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్షం టీడీపీ తమ ఓట్లు సాధించుకునే క్రమంలో ఎన్నో వ్యయప్రయాసలు పడుతున్నాయని తెలుస్తోంది.
Also Read: AP Liquor Business: ఏపీలో మద్యంపై సర్కార్ ఆదాయం తెలిస్తే కళ్లు బైర్లు