Shilpa Chowdary: మోసగాళ్లకు మోసగాడు గురించి విన్నాం, కానీ ఇలాంటి హైటెక్ మోసగత్తె గురించి మాత్రం మీరెప్పుడు విని ఉండరు. ఎందుకంటే.. ప్రముఖుల పేర్లు చెప్పి సెలబ్రిటీల దగ్గర, సెలబ్రిటీల పేర్లు చెప్పి ప్రముఖుల దగ్గర డబ్బులు తీసుకున్న చాకచక్యం ఆమెది. దాదాపు వంద కోట్లకు పైగా కాజేసింది. పేరు శిల్పా చౌదరి. పేరులో ఉన్న గౌరవం మనిషిలో లేదు. మోసాలకు కేరాఫ్ అడ్రస్ అయింది.

ప్రస్తుతం ఆమె చేసిన మోసాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ లో ఆమె పేరే ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. ఆమె ఎవర్నీ వదిలిపెట్టలేదు. దాదాపు అందరి దగ్గర ఆమె తన చేతి, మాట మోసాన్ని ఘనంగా చాటుకుంది. అసలు మోసం ఎలా చేయాలి ? అనే అంశంలో ఆమె తర్వాతే ఎవరైనా. అంత గొప్పగా మోసం చేస్తోంది.
నిజానికి ఎప్పటి నుంచో ఈ మోసాల పరంపర కొనసాగుతున్నా.. తాజాగా శిల్ప చౌదరి బాగోతాలు వెలుగులోకి వచ్చాయి. శిల్ప చౌదరి రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పెట్టింది. తన ఏజెన్సీ ద్వారా స్థలం ఇప్పిస్తానని అందరికీ గొప్పలు చెప్పేది. చూడటానికి అందంతో పాటు ఒంటి పై నగల గుమగుమలతో నిండుగా కనబడేది. పైగా ఆమె మాటలోనే మత్తు ఉండేది. ఎంతటి మగాడు అయినా ఆమె మత్తులో పడి గిలగిలా కొట్టుకోవాల్సిందే.
Also Read: శిల్పంతో వల విసిరింది.. సినీ హీరోలు గిలగిలా కొట్టుకుంటున్నారు..!
అందుకే, శిల్ప చౌదరి అంతమందిని మోసం చేయగలిగింది. దివ్య రెడ్డి అనే మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తూ.. ‘శిల్ప చౌదరి నా వద్ద కోటిన్నర రూపాయలు తీసుకుని మోసం చేసింది. డబ్బులు తిరిగి ఇవ్వమంటే.. బౌన్సర్ల తో బెదిరించింది’ అంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దివ్య రెడ్డి. పోలీసులు కూడా ప్రాథమిక విచారణ జరిపారు.
ఆ విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అనేక మంది ప్రముఖులు కూడా శిల్ప చౌదరి చేతిలో అడ్డంగా బుక్ అయ్యారు. సినీ పరిశ్రమ వారుతో పాటు, ఫైనాన్షియర్ లు, అలాగే వ్యాపారవేత్తలలో పలువురు శిల్పా చౌదరికి భారీగా డబ్బులు సమర్పించుకుని చివరకు మోసపోయాం అని లబోదిబో అంటూ బయటకు చెప్పడానికి కూడా సిగ్గు పడుతున్నారు. అన్నట్టు ఒక బడా నిర్మాత కొడుకు, మరొక బడా నిర్మాత కూతురు శిల్పా చౌదరి కి అత్యంత సన్నిహితులు అట. మొత్తమ్మీద సినిమా వాళ్లకే సినిమా చూపించింది.
Also Read: మద్యం కలుపుతూ బుట్టబొమ్మ వీడియో వైరల్.. ఇంత చీప్ టేస్ట్ అనుకోలేదంటూ ట్రోల్స్!