https://oktelugu.com/

అక్టోబర్లో ఈ వానలేంది.? కారణం ఇదట!

అక్టోబర్ లో కూడా ఎందబ్బా ఈ వానలు అనుకోని వారు లేరు.. వర్షాకాలం ముగిసిన కూడా ఎందుకు ఇంతలా దంచుతున్నయో అని మధనపడిపోతున్నారు. కుండపోత వానలపై వాతావరణ కేంద్రాలు, సైంటిస్టులు  ఓ నజర్ వేశారు.  అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను  స్టడీ చేస్తున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఓ అంచనాకు వచ్చారు. దాని ప్రకారం వివరాలు కింద విధంగా ఉన్నాయి. Also Read: హైదరాబాద్‌లో మళ్లీ భయం.. జోరందుకున్న వర్షం! 1. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 20, 2020 3:42 pm
    Follow us on

    అక్టోబర్ లో కూడా ఎందబ్బా ఈ వానలు అనుకోని వారు లేరు.. వర్షాకాలం ముగిసిన కూడా ఎందుకు ఇంతలా దంచుతున్నయో అని మధనపడిపోతున్నారు. కుండపోత వానలపై వాతావరణ కేంద్రాలు, సైంటిస్టులు  ఓ నజర్ వేశారు.  అంతర్జాతీయ వాతావరణ పరిస్థితులను  స్టడీ చేస్తున్నారు. అయితే వీరు ప్రస్తుతం ఓ అంచనాకు వచ్చారు. దాని ప్రకారం వివరాలు కింద విధంగా ఉన్నాయి.

    Also Read: హైదరాబాద్‌లో మళ్లీ భయం.. జోరందుకున్న వర్షం!

    1. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ తో కాలుష్యం తగ్గి గాలిలో స్వచ్ఛత ఏర్పడి తేమ పెరుగడం
    2. రుస అల్పపీడనాలతో నైరుతి రుతుపవనాల నిష్క్రమణలో జాప్యం
    3. షీర్ జోన్లు
    4. ఫసిఫిక్ మహా సముద్రంలో ఏటా ఉండే ఎల్నినో ప్రభావం  భారత్ పై లేకపోవడం(ఎల్నినో అంటే తక్కువ వర్షపాతానికి కారణమయ్యేది)

    ఏటా నైరుతి రుతుపవనాలు సెప్టెంబర్ నుంచి నిష్క్రమించాలి. ఇవి ఎంత త్వరగా నిష్క్రమించాయనే దానిని బట్టే  వానాకాలం సీజన్ లెక్కలుంటాయి. గత 11ఏండ్లలో ఒకే సారి 2018లో మాత్రమే అత్యంత ఆలస్యంగా సెప్టెంబర్ 29న రాజస్థాన్ నుంచి నిష్క్రమించాయి. కాగా, ఈ ఏడాది  సెప్టెంబర్ 28న వెనక్కి వెళ్లడం మొదలైంది. అవి మధ్యప్రదేశ్ కు వచ్చేసరికి బంగళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, అల్పపీడనాల గాలులు వాటి  నిష్క్రమణకు అడ్డుచక్రంలా మారి అక్కడే ఆపేశాయి. దీంతో అవి తెలంగాణ నుంచి ఎప్పుడు వెళ్లిపోతాయనేది  సైంటిస్టులు కూడా ఇప్పటికిప్పుడు చెప్పలేకపోతున్నారు. అవి వెనక్కిపోవాలంటే బంగళాఖాతంలో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి. కాని ఇప్పుడు  ఆ పరిస్థితి లేదు. మరో  అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో రుతుపవనాలు నాలుగైదు రోజుల వరకు ఇక్కడే ఉండే అవకాశాలుంటున్నాయని చెబుతున్నారు. అవి పూర్తిగా వెనక్కి పోతేనే వర్షాలు తగ్గుముఖం పడుతాయని అంటున్నారు.

    వీటితో పాటుగా ఉత్తర–దక్షిణ, తూర్పు– పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ప్రవాహ ద్రోణులు ఏర్పడుతున్నాయి. వీటిని వాతావరణ భాషలో ‘ షీర్ జోన్’ అని పిలుస్తారు. ఇలా గాలుల ప్రవాహం ఏర్పడినప్పుడు అవి పయనించే మార్గంలో వాతావరణం చల్లబడి తేమను తీసుకొస్తాయి.  ప్రస్తుతం బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో 508కి.మీ ఎత్తు వరకూ గాలులతో ఉపరిత ఆవరన్తనం ఉంది. మంగళవారాని కల్లా ఇది అల్పపీడనంగా మారే అవకాశముంది. ఇదే టైంలో తూర్పు–పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలుల ద్రోణి ఇదే ఉపరితల ఆవర్తనం మీదుగా 1.5కి.మీ. నుంచి 5.8కి.మీ. వరకూ వెళుతోంది. ఈ ఉపరితల ఆవర్తన గాలుల మధ్య నుంచి షీర్ జోన్ వెళ్లడం వల్ల అక్కడ ఒత్తిడి మరింత పెరిగి అల్ప పీడనం ఏర్పడటానికి ఎక్కువ అవకాశమేర్పడింది. దీని ప్రభావంతో మంగళ, బుధవారాల్లో తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

    Also Read: బండి సంజయ్ పై తొడగొట్టిన హరీష్ రావు

    * భారీ వర్షాల్లో తెలంగాణ 4వ స్థానం
    ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వానాకాలంలో దేశంలో కెల్లా అత్యంత ఎక్కువగా సౌరాష్ట్ర కచ్ సబ్ డివిజన్ లో సాధారణం కన్నా 126శాతం, రాయలసీమలో 84, ఉత్తర కర్ణాటలో 49, తెలంగాణలో 46శాతం అదనపు వర్షపాతం కురిసింది.  దేశంలో ఇది నాలుగో స్థానం. తెలంగాణలో ఇంత అధిక వర్షపాతం గత 33ఏండ్లలో ఎన్నడూ నమోదు కాలేదు.