TS Govt Free Medicines: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు ప్రజలు తమకు వచ్చిన జబ్బులకు ప్రైవేటు మందులు తీసుకుంటూ తమ సంపాదనలో ఎక్కువ భాగం మందులకే ఖర్చు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ జబ్బులకు వాడే మందులను తానే సరఫరా చేయాలని భావించింది. దీంతో రోగులు ఇన్నాళ్లుగా పెట్టే ఖర్చులకు ప్రభుత్వం ఉచితంమగా సరఫరా చేయాలని నూతన పద్ధతికి శ్రీకారం చుట్టడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ప్రజలకు అవసరమైన ఔషధాలను ప్రభుత్వం సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇందుకు గాను జాబితాలు సిద్ధం చేస్తోంది. మొదట 123 మందులు సరఫరా చేయాలని నిర్ణయించినా తరువాత 720కి పెరిగాయి. ఇప్పుడు 840 రకాల మందులను ఉచితంగా ఇచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. దీంతో ప్రభుత్వం ఉచితంగా అందించే మందులతో పేదవారికి మేలు జరగనుంది. దీనికి సర్కారు కార్యాచరణ రూపొందిస్తోంది. పలు రోగాలకు మందులు సరఫరా చేసి వారి ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నాలు చేస్తోంది.
Also Read: TRS – BJP- Congress: కాంగ్రెస్ ను మట్టి కరిపించేందుకే కమలం, కారు దోబూచులాడుతున్నాయా?
మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కాలేయం, నొప్పి నివారణ మందులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఔషధ సంస్థలకు సూచనలు ఇస్తోంది. నలభై ఏళ్లు దాటాక 60 శాతం మందిలో పలు రకాల రోగాలు వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఔషధాల సరఫరా కోసం అన్ని చర్యలు తీసుకుంటోంది. ప్రజలకు నేరుగా అందించేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వ సూచనల మేరకే మందులను వినియోగదారులకు చేర్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వం ప్రజల బాగోగుల కోసం చర్యలు తీసుకుంటున్న సందర్భంలో మందులను రోగులకు అందజేసేందుకు సమాయత్తమవుతోంది. మందుల వాడకంతో వారి ఆరోగ్యాన్ని రక్షించేందుకే ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యం కోసం చర్యలు తీసుకుంటోందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంచేందుకే మందులు సరఫరా చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చొరవతో ఇప్పుడు ప్రజల్లో మంచి ఆదరణ కలగనుందని సమాచారం.
Also Read:Prudhvi Raj: పవన్ విషయంలో పృథ్వీ రాజ్ పశ్చాతాపం.. మరి ఆ వైభవం వస్తోందా ?