Mahesh – Vijay Combination: సౌత్ ఇండియా లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి మరియు తలపతి విజయ్ కి ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ ఇద్దరి సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే వారి రాష్ట్రాల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది..అంతే కాకుండా మాములు యావరేజి సినిమాలను కూడా బ్లాక్ బస్టర్ రేంజ్ కి తీసుకొని పోగల సత్తా ఉన్న హీరోలు వీళ్లిద్దరు మాత్రమే..ప్రస్తుతం సౌత్ లో వీళ్ళిద్దరిని కొట్టే హీరోలే లేకపోవడం విశేషం..టాలీవుడ్ లో మహేష్ బాబు కి ఏకంగా నాలుగు వంద కోట్ల షేర్స్ ని సాధించిన సినిమాలు ఉన్నాయి..ఇలాంటి రేర్ రికార్డు టాలీవుడ్ లో మరో హీరో కి లేకపోవడం విశేషం..అలాగే తమిళనాడు లో విజయ్ కూడా ప్రస్తుతం రజినీకాంత్ ని మించిన స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు..ఇలాంటి ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు..అప్పట్లో ఆ పర్యటనలు కూడా జరిగాయి అనే విషయం చాలా మందికి తెలియదు.

ఇక అసలు విషయానికి వస్తే అప్పట్లో సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్ మణిరత్నం గారు భారీ బడ్జెట్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు తలపతి విజయ్ లతో కలిసి ఒక ముల్టీస్టార్ర్ర్ మూవీ తీద్దాం అని అనుకున్నారు..ఈ సినిమా ని అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో అన్ని బాషలలో తెరకెక్కించాలని చూసారు..కానీ ఎందుకో ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చలేదు..ఇప్పుడు అదే ప్రాజెక్ట్ ని తమిళ స్టార్ హీరోలైన విక్రమ్ మరియు కార్తిలను పెట్టి పొన్నియన్ సెల్వన్ పేరుతో భారీ బడ్జెట్ పెట్టి తెరకెక్కించారు..ఇటీవలే ఆ సినిమా టీజర్ కూడా విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది..ఈ సినిమాలో వీళ్లిద్దరు మాత్రమే కాకుండా తమిళ హీరో జయం రవి కూడా ఒక ముఖ్య పాత్ర పోషించగా, త్రిష మరియు శోభిత దూళిపాళ్ల హీరోయిన్స్ గా నటించారు..ఇక మిస్ యూనివర్స్ గా పేరు తెచ్చుకున్న అందాల తార ఐశ్వర్య రాయి బచ్చన్ ఇందులో విలన్ గా నటిస్తుంది..అలా భారీ బడ్జెట్ తో మహేష్ – విజయ్ తో తీద్దాం అనుకున్న ఈ సినిమా చివరికి విక్రమ్ – కార్తీ లతో తీసాడు ఆ చిత్ర దర్శకుడు మణిరత్నం.
