https://oktelugu.com/

‘బస్తీ’మే సవాల్.. రంగంలోకి కేసీఆర్..వ్యూహాత్మకమేనా?

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి గడిచిన ఆరేళ్లలో ఎదురులేకుండా పోయింది. టీఆర్ఎస్ ఆడిందే ఆటగా.. పాడింతే పాటగా నడిచింది. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లు టీఆర్ఎస్ హవా కొనసాగింది. కారు స్పీడుకు ప్రతిపక్షాల పార్టీలన్నీ బేజారయ్యేవి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు టీఆర్ఎస్ కు అనుకూలంగా లేవని దుబ్బాక ఎన్నికతో తేటతెల్లమైంది. Also Read: గ్రేటర్ వార్ కూడా బీజేపీ-టీఆర్ఎస్ మధ్యేనా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ? టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 18, 2020 / 02:51 PM IST
    Follow us on

    తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి గడిచిన ఆరేళ్లలో ఎదురులేకుండా పోయింది. టీఆర్ఎస్ ఆడిందే ఆటగా.. పాడింతే పాటగా నడిచింది. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక జరిగిన వార్ వన్ సైడ్ అన్నట్లు టీఆర్ఎస్ హవా కొనసాగింది. కారు స్పీడుకు ప్రతిపక్షాల పార్టీలన్నీ బేజారయ్యేవి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు టీఆర్ఎస్ కు అనుకూలంగా లేవని దుబ్బాక ఎన్నికతో తేటతెల్లమైంది.

    Also Read: గ్రేటర్ వార్ కూడా బీజేపీ-టీఆర్ఎస్ మధ్యేనా? కాంగ్రెస్ పరిస్థితి ఏంటీ?

    టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నిక జరిగిన గులాబీ జెండానే ఎగిరింది. అయితే ఆ రికార్డును దుబ్బాక ఉప ఎన్నిక రివర్స్ చేసింది. దుబ్బాకలో నల్లేరుపై నడకలాగా టీఆర్ఎస్ విజయం సాధిస్తుంది అనుకుంటే 1,100ఓట్లతో తేడాతో ఓటమి చెందింది. దుబ్బాకలో జరిగిన హోరాహోరీ పోరులో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించి కేసీఆర్ కు గట్టి షాకిచ్చాడు.

    దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను మంత్రి హరీష్ తీసుకున్నప్పటికీ బీజేపీనే గెలిచింది. టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు వ్యూహాలు బీజేపీ ముందు ఏమాత్రం పని చేయలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీకి రాష్ట్రంలో ఏమాత్రం పుంజుకునే ఛాన్స్ ఇవ్వద్దనే కేసీఆర్ వ్యూహాత్మకంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

    Also Read: లెక్కలివీ: టీఆర్ఎస్ కే మేయర్ పీఠం?

    సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలను పర్యవేక్షిస్తుండటంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కన్పిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని టీఆర్ఎస్ సైన్యాన్ని మొత్తానికి దింపారు. మంత్రులు.. ఎమ్మెల్యేలు.. పార్టీలోని ముఖ్య నేతలందరికీ డివిజన్ల బాధ్యతలను అప్పగించి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు. ఒక్కో మంత్రి ఏడు నుంచి ఎనిమిది డివిజన్లు పర్యవేక్షించేలా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.

    కేసీఆర్ ఆదేశాలు మంత్రులంతా జీహెచ్ఎంసీలోనే తిష్ఠవేసి ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. కాలనీల్లోని సమస్యలను తెలుసుకొని ఆమేరకు ప్రజలు హామీలిస్తూ ఆకట్టుకునే పనిలో పడ్డారు. ఒక్కో బూత్ పరిధిలో 20మంది టీమును ఏర్పాటు చేసుకొని ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ముగిసేంత వరకు కూడా వారంతా హైదరాబాద్లో మకాం వేయనున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    కేసీఆర్ ఆదేశాలనే కేటీఆర్ ఫాలో అవుతూ నిరంతరం సమావేశాలు.. సమీక్షలు చేస్తున్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్ ఒక్కడే అంతా తానై నడిపించగా ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం కేసీఆర్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి పాలవడాన్నీ కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలను సీఎం కేసీఆర్ ఛాలెంజ్ గా తీసుకుని ప్రతిపక్షాలకు ‘బస్తీ’మే సవాల్ విసురుతున్నారు.