https://oktelugu.com/

ఏపీ మళ్లీ నంబర్ 1.. కేంద్రం ప్రకటన

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. అయితే రాజధాని కూడా లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో సత్తా చాటడం విశేషం. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్’లో కేంద్రం తాజాగా ఏపీకి అగ్రస్థానం కట్టబెట్టింది. అష్టకష్టాలు పడుతున్నా సరే ఏపీ ఈ రంగంలో సత్తాచాటడం విశేషం. తాజాగా కేంద్రం ప్రకటించిన ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్‌కు మొదటిస్థానం రాగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. Also Read: ప్రచారానికి సంక్షేమం… అభివృద్ధికి ప్రజాధనం – […]

Written By:
  • NARESH
  • , Updated On : September 5, 2020 / 05:38 PM IST
    Follow us on

    తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత అభివృద్ధిలో పోటీపడుతున్నాయి. అయితే రాజధాని కూడా లేకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో సత్తా చాటడం విశేషం. అభివృద్ధి సంగతి ఎలా ఉన్నా ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్’లో కేంద్రం తాజాగా ఏపీకి అగ్రస్థానం కట్టబెట్టింది. అష్టకష్టాలు పడుతున్నా సరే ఏపీ ఈ రంగంలో సత్తాచాటడం విశేషం. తాజాగా కేంద్రం ప్రకటించిన ర్యాంకులలో ఆంధ్రప్రదేశ్‌కు మొదటిస్థానం రాగా.. తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.

    Also Read: ప్రచారానికి సంక్షేమం… అభివృద్ధికి ప్రజాధనం – ఇదే జగన్ పాలసీ

    సులభతర వాణిజ్యంలో నాడు చంద్రబాబు హయాంలోనూ ఏపీ దేశంలో నంబర్ 1 స్థానంలో నిలవడం విశేషం. ఇప్పుడు జగన్ ప్రభుత్వం కాలంలోనూ అదే స్థానాన్ని దక్కించుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తాజాగా వ్యాపార సంస్థల కార్యాచరణ ప్రణాళిక-2019ను విడుదల చేశారు.

    అయితే గతంలో రెండోస్థానంలో ఉన్న తెలంగాణ ఈసారి మూడో స్థానానికి పడిపోవడం ఆశ్చర్యపరించింది. ఉత్తరప్రదేశ్ రెండోస్థానాన్ని ఆక్రమించింది. గతంలో యూపీ 12వ స్థానంలో నిలవగా.. ఈసారి ఏకంగా రెండో స్థానానికి చేరడం విశేషం.

    2019 మార్చి 31వరకు రాష్ట్రాలు అమలు చేసిన సంస్కరణలు పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ 10వస్థానానికి పడిపోవడం గమనార్హం.

    Also Read: కృష్ణ నీటి కోసం ఏపీ ఫైట్

    దేశంలోనే పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని కేంద్రఆర్థిక మంత్రి నిర్మల అభినందించారు. కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ ను అమలు చేయడంలో అన్ని రాష్ట్రాలకంటే ఏపీ ముందు ఉందని పొగడ్తల్లో ముంచెత్తింది.

    అయితే 2019 మార్చి 31 వరకు మాత్రమే ఈ గణాంకాలు పరిగణలోకి తీసుకోవడంతో ఈ క్రెడిట్ అంతా అప్పటి వరకు పాలించిన చంద్రబాబుకే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్ పాలన మే 2019 నుంచి ప్రారంభం కావడంతో ఈ క్రెడిట్ బాబు సొంతమే..