https://oktelugu.com/

బ్రేకప్ లు, డైవోర్స్ కథలో రామ్ ‌!

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ ఇప్పటికే తమిళ్ రీమేక్ ‘రెడ్’ సినిమాని చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ రామ్ మార్కెట్ రేంజ్ ను ఇంకా పెంచుతున్నాయి. అయితే రామ్ మరో తమిళ్ రీమేక్ లో కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ‘ఓ మై కడవులే’ సినిమా విడుదలై.. మంచి ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద […]

Written By:
  • admin
  • , Updated On : September 5, 2020 / 06:05 PM IST
    Follow us on


    ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ ఇప్పటికే తమిళ్ రీమేక్ ‘రెడ్’ సినిమాని చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా డైరెక్ట్ గా డిజిటల్ లో రిలీజ్ చేయటానికి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్స్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేస్తూ రామ్ మార్కెట్ రేంజ్ ను ఇంకా పెంచుతున్నాయి. అయితే రామ్ మరో తమిళ్ రీమేక్ లో కూడా నటించబోతున్నాడని తెలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ‘ఓ మై కడవులే’ సినిమా విడుదలై.. మంచి ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను దక్కించుకుంది. దాంతో పక్క భాషా నిర్మాతలు ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం అప్పట్లో బాగానే పోటీ పడ్డారు. అయితే ఆ పోటీలో పీవీపీ గెలిచారనుకోండి.

    Also Read: యాక్షన్ కాంబినేషన్ లో ఫ్యామిలీ డ్రామా !

    ‘ఓ మై కడవులే’ సినిమా తెలుగు భాష రీమేక్ హక్కులను నిర్మాత పీవీపీ భారీ ధరకు దక్కించుకున్నాడు. పీవీపీ పక్కా బిజినెస్ మైండెడ్. మ్యాటర్ లేకపోతే రూపాయి కూడా పెట్టుబడిగా పెట్టడు. అలాంటిది ఆయన ఈ సినిమా రైట్స్ విషయంలో తెలుగులోనే కాకుండా మరి కొన్ని భాషలలో కూడా రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత ఈ సినిమా చేస్తారా? అని పీవీపీ అక్కినేని అఖిల్ ను అప్రోచ్ అయ్యారని, అయితే అఖిల్ మాత్రం ఈ సినిమాకి నో చెప్పాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా రామ్ దగ్గరకు వెళ్ళిందట.

    Also Read: అవమానాలు భరించాను.. నాని హాట్ కామెంట్స్

    నిజానికి ‘ఓ మై కడవలే’ సబ్జెక్ట్ రామ్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఈ జనరేషన్ యువత మనో భావాలకు అద్దం పట్టేలా కథ సాగడం, పైగా యూత్ ను ఆకట్టుకునే కంటెంట్ సినిమాలో దండిగా ఉండటం, ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు, బ్రేకప్ లు, డైవోర్స్ ఇలాంటి వ్యవహారాలు ఈ సినిమాలో బాగానే ఉంటాయి. పైగా రామ్ కు ఈ కథ చాల కొత్తగా కూడా ఉంటుంది.