నేటి నుంచి సభాసమరం.. కొట్లాట దేనిపైనంటే?

ఆంధ్రప్రదేశ్ లోని బలమైన అధికార, ప్రతిపక్షాల సభా సమరానికి వేదిక రెడీ అయ్యింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ ఉదయం 9 గంటల నుంచి ఏపీ శాసనసభ, 10 గంటల నుంచి శాసన మండలి సమావేశం కానుంది. అసెంబ్లీని 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ సమావేశాల్లోనే 17 బిల్లులను ఆమోదింప చేసుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. Also Read: కుప్పం నుంచి చంద్రబాబును గెంటేస్తారా..? ఈ […]

Written By: NARESH, Updated On : November 30, 2020 1:24 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లోని బలమైన అధికార, ప్రతిపక్షాల సభా సమరానికి వేదిక రెడీ అయ్యింది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలు కాబోతున్నాయి. ఈ ఉదయం 9 గంటల నుంచి ఏపీ శాసనసభ, 10 గంటల నుంచి శాసన మండలి సమావేశం కానుంది. అసెంబ్లీని 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ సమావేశాల్లోనే 17 బిల్లులను ఆమోదింప చేసుకోవాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.

Also Read: కుప్పం నుంచి చంద్రబాబును గెంటేస్తారా..?

ఈ 5 రోజుల్లోనే కీలకమైన బిల్లులకు ఆమోదం పొందించుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉండగా.. అడ్డుకోవాలని టీడీపీ చూస్తోంది. ఇప్పటికే శాసనసభలో ఆమోదించిన బిల్లులను మండలిలో టీడీపీ అడ్డుకుంటోంది. ఈ క్రమంలోనే మరోసారి అదే పని పునరావృతం కానుంది.

Also Read: ఏపీ మంత్రి నానిపై హత్యాయత్నం.. ఎందుకు చేశాడంటే?

ఏపీ అసెంబ్లీలో తాజాగా ప్రభుత్వం చర్చకు పెట్టే అంశాలను ఖరారు చేసింది. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌-విద్యుత్‌ రంగంలో సంస్కరణలు…, పోలవరం ప్రాజెక్టు-గత ప్రభుత్వ తప్పిదాలు.. ఇళ్ల స్థలాల పంపిణీ-ప్రతిపక్షాల కుట్ర.. టిడ్కో గృహాలు-వాస్తవాలు.. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ-ప్రతిపక్షాల కుట్ర.. పారిశ్రామికాభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా పంచాయితీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన ఆర్డినెన్స్ ను ఆమోదించుకోవాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మండలి తిరస్కరించిన బిల్లును మళ్లీ ప్రవేశపెడుతున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం: ఏపీ పాలిటిక్స్

తొలిరోజు అసెంబ్లీలో ఇటీవలే చనిపోయిన వారిని సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గాయకుడు బాలు,ఏపీకి చెందిన నేతల మృతికి సభ సంతాపం తెలుపనుంది. అనంతరం మూడురోజుల్లో ఈ 17 బిల్లులు ఆమోదించుకోనుంది.