Andhra Jyothi: ఇటీవల కాలంలో వార్తల ప్రసారానికి అడ్డూ అదుపు లేకుండా పోయిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదిగో పులి అనగానే ఇదిగో తోక అనే విధంగా వార్తలు టెలికాస్ట్ అవుతున్నాయి. ఇక యూట్యూబ్ చానళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. వారు కొంచెం మసాలా యాడ్ చేసి మరీ వార్తలను ప్రసారం చేస్తున్నారు. తమకు నచ్చినట్లు అన్వయించుకుని వాస్తవానికి దూరంగా ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తల ప్రసారం ఏపీ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ విషయంలోనూ జరిగింది.

తాజాగా లక్ష్మీనారాయణ ఇంటికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లిన క్రమంలో తనిఖీలు చేసే సమయంలో రసాభాస జరిగిందనే వార్త ప్రముఖంగా కొందరు ప్రచారం చేశారు. అయితే, ఇందులో తనిఖీల సందర్భంలో ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే వచ్చారని, ఆయన ఇంటికెళ్లి అధికారులతో వాగ్వాదం జరిపారని ఇలా రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ, నిజానికి జరిగిన విషయం అయితే వేరేలాగా ఉంది. కొన్ని టీవీ చానళ్లు, యూట్యూబర్స్ తమకు తోచిన రీతిలో విషయాన్ని అల్లేసుకుని దానికి తగ్గట్లుగా ఊహాలు కూడా మిక్స్ చస్తున్నారు. ఇంట్లోకి ప్రవేశించే వేళలో ఏపీ సీఐడీ అధికారులు గేట్లను తీసేసినపుడు అవి దెబ్బతిన్నాయని వార్తలు ప్రచారం చేశారు.
Also Read: సాయితేజ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం ఎంత సాయం చేసిందో తెలుసా?
లక్ష్మీనారాయణ ఇంటి వైపు నుంచి వెళ్తున్న క్రమంలో ఆయన ఒత్తిడిలో ఉన్నారని తెలుసుకుని మాత్రమే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాక్రిష్ణ వెళ్లారని తెలుస్తోంది. కానీ, ఈ విషయం ప్రచారం చేయకుండా తమకు తోచినట్లుగా ఆయన అధికారులతో గొడవకు దిగాడని, అధికారులు, ఆర్కేకు మధ్య వాగ్వాదం జరిగిందని ప్రచారం చేశాయి కొన్ని టీవీ చానళ్లు. లక్ష్మీనారాయణకు, సీఐడీ అధికారులకు మధ్య వాగ్వాదం జరుగుతున్న నేపథ్యంలో ఆర్కే అక్కడికి వెళ్లి అధికారులకు సహకరించాలని చెప్పారట. కానీ, ఈ విషయం ప్రచారం చేయకుండా ఆర్కే సైతం అధికారులతో వాగ్వాదానికి దిగారని ప్రచారం చేశాయి కొన్ని చానళ్లు.
ఒకరకంగా సీఐడీ అధికారులు ఆర్కే రాకను స్వాగతించినట్లు తెలుస్తోంది. కానీ, ఆ విషయం చెప్తే మసాలా ఉండదనుకున్నారో ఏమో తెలియదు. కానీ, పూర్తిగా భిన్నమైన ప్రచారం చేసి మసాలా యాడ్ చేస్తున్నారు కొందరు. ఇటువంటి ధోరణి సమాజంలో మంచిది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. వార్తలను వార్తలుగానే ప్రచారం చేయాలని, ఎట్టి పరిస్థితుల్లో మసాలా యాడ్ చేయొద్దని, అలా చేయడం వల్ల ఇబ్బందులే తలెత్తుతాయని అంటున్నారు. వాస్తవాలను ప్రజలకు తెలపాల్సిన బాధ్యత మీడియాకు ఉందని కొందరు సూచిస్తున్నారు.
Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ నేతల గుబులు.. ఆ స్థానంపైనే ఫోకస్ !