Actor Ali: ప్రముఖ కమెడియన్ అలీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన శైలిలో ప్రేక్షకులతో కడుపుబ్బ నవ్వించాడు ఈ నటుడు. వందల సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులందరిలో చెరగని ముద్రా వేసుకున్నాడు ఆలీ. నాలుగు దశాబ్ధాల నుంచి తెలుగు తెర పై నవ్వులతో అలరించిన అనుభవం ఆయనది, ఎలాంటి పాత్ర అయిన సరే, ఆ పాత్రకు కూడా నవ్వడం నేర్పించగలిగే చాతుర్యం ఆలీకే చెందింది. కాగా తాజాగా కె.ఎల్.యు. యూనివర్సిటీ నటుడు ఆలీకి డాక్టరేట్ ను ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఆన్‌లైన్ టికెట్, బెన్‌ఫిట్ షో వివాదంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆలీకి డాక్టరేట్ ప్రకటించిన సంధర్బంగా ఆయన మీడియా తో ముచ్చటించారు. కె.ఎల్ యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. సొంత ఊరిలో ఉండగా ఈ డాక్టరేట్ రావడం మరింత సంతోషం కలిగించిందని ఆలీ వెల్లడించారు. అలాగే సిఎం జగన్ కూడా తనకు మంత్రి పదవి ప్రకటిస్తే మరింత ఆనందం అని పేర్కొన్నారు ఆలీ. సినిమా రంగానికి సమస్యగా మారిన ఆన్ లైన్ టిక్కెట్లు విధానం, బెనెఫిట్ షో వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అలీ చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని… హామీ కూడా ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిపాలనా అద్భుతంగా ఉందని… ఆయన అన్ని వర్గాలకు సమన్యాయం చేకూర్చారని కొనియాడారు ఆలీ. ఏపీ ప్రజలకు అన్ని రకాలుగా జగన్ సర్కార్ ఉపయోగ పడుతుందని చెప్పారు అలీ. ఒక నటుడిగా తన వంతు బాధ్యతగా గా సాధ్యమైనంత మేరకు ఈ విషయం గురించి జగన్ తో మాట్లాడతా అన్నారు.