WFH Effect: కొవిడ్ మహమ్మారి కట్టడికి విధించిన లాక్ డౌన్‌తో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేటు ఆఫీసులు వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పించాయి. అయితే, ఆ తర్వాత కాలంలో ఈ వర్క్ ఫ్రం హోం ఎత్తేసి మళ్లీ భౌతికంగా కార్యాలయాలను తెరిచారు. దాదాపుగా చాలా మంది వర్క్ ఫ్రం హోమ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ ఈ సౌకర్యం వల్ల ఎంచక్కా హాయిగా కుటుంబ సభ్యులతో గడపొచ్చని అనుకుంటున్నారు. కానీ, వర్క్ ఫ్రం హోమ్ వలన ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కొవిడ్ కారణంగా రెండేళ్ల నుంచి ఇంటి దగ్గరి నుంచే విధులు నిర్వహించడం వల్ల ఈ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కు అరుదైన వ్యాధి వచ్చింది. వివరాల్లోకెళితే.. ఆంధప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 25 ఏళ్ల యువకుడు అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తూ బానే ఉన్న ఇతను.. ఇటీవల కాలంలో ఏర్పడ్డ కరోనా మహమ్మారి పరిస్థితులతో అందరి లాగానే ఇంటి దగ్గర చిక్కుకుపోయాడు. ఆఫీసు వాళ్లు ఇచ్చిన వర్క్ ఫ్రం హోంతో ఇంటి దగ్గరి నుంచే పని చేస్తున్నాడు.
అయితే, ఈ వర్క్ ఫ్రం హోంలో ఎక్కువ సమయం వర్క్ చేయడం వలన అతడి కాళ్లు, చేతులు పట్టేశాయి.
Also Read: ఐరన్ లోపంతో బాధ పడుతున్నారా.. ఈ ఆహారంతో సులువుగా చెక్?
నార్మల్‌గానే అలా పట్టేశాయని భావించి యువకుడు లైట్ తీసుకున్నాడు. కానీ, సీరియస్ నెస్ బాగా పెరిగి యువకుడి కాళ్లు, చేతులు చచ్చుబడి కూర్చుంటే లేవలేకపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అతనికి వచ్చిన వ్యాధి ఏంటనేది తెలుసుకునేందుకు అగ్రరాజ్య వైద్యులు ప్రయత్నించారు. కానీ, వారి వల్ల కాలేదు. చివరకు గుంటూరు ప్రభుత్వ బోధానస్పత్రి న్యూరాలజీ విభాగం వైద్యులు ఆ అరుదైన వ్యాధిని గుర్తించారు.
వ్యాధిని గుర్తించేందుకు శాస్త్రీయంగా బృందం అధ్యయనం చేసినట్లు న్యూరాలజీ విభాగ అధిపతి సుందరాచారి తెలిపారు. సదరు యువకుడికి ‘పాలియో సిండ్రోమ్’ అనే అరుదైన డిసీజ్ వచ్చినట్లు పేర్కొన్నారు. చూశారా.. వర్క్ ఫ్రం హోం వల్ల ఇతనికి అరుదైన వ్యాధి వచ్చేసింది. ఇకపోతే అగ్రరాజ్య వైద్యులు గుర్తించని వ్యాధిని భారతీయ వైద్యులు అదీ ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన వారు గుర్తించిన విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: స్టేడియంలోనే లవ్.. ప్రపోజ్ తో ప్రేక్షకులంతా కెవ్వు