
Anasuya Bharadwaj: జబర్దస్త్ వ్యాఖ్యాత అనసూయ అందరికి సుపరిచతమే. తన మనసులోని మాట బయట పెట్టే ఆమె ఎప్పుడు తనలోని భావాలు బయటపెట్టడం చూస్తున్నాం. సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడు తన ఆలోచనలను వెల్లడించే ఆమెకు వచ్చిన సందేహాలను నివృత్తి చేసుకుంటుంటారు. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభం అయిన నేపథ్యంలో యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలపై మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు.
పాఠశాల యాజమాన్యాలు పిల్లలకు ఏదైనా జరిగితే తల్లిదండ్రులదే బాధ్యత అని పేపర్ పై సంతకాలు చేయించుకుంటూ అనుసరిస్తున్న వైఖరిపై ప్రశ్నించడంతో అందరు ఏకీభవిస్తున్నారు. స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులకు విధిస్తున్న షరతులపై ఆమె తన వంతు బాధ్యతగా ప్రశ్నించింది. దీనిపై మార్గనిర్దేశం చేయాలని మంత్రి కేటీఆర్ ను కోరింది. దీంతో నెటిజన్లు సైతం ఆమె అభిప్రాయాలు సరైనవే అని చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టే అనసూయ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంటుంది. తన అభిప్రాయాలు, ఫొటోలు నెట్టింట్లో పెడుతూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఆమె చేసిన పోస్టులపై సమాధానాలు చెప్పాలన అడుగుతున్నారు.
పెద్దలకు ఇప్పటికే వ్యాక్సిన్ వేస్తుండటంతో కరోనా తగ్గుముఖం పట్టింది. కానీ చిన్న పిల్లలకు మాత్రం ఎలాంటి టీకాలు వేయడం లేదు. దీంతో స్కూల్ యాజమాన్యాలు తల్లిదండ్రులను పెడుతున్న ఇబ్బందుల దృష్ట్యా అనసూయ ప్రశ్నలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని కోరింది.
Also Read: మెగా హీరోతో అనసూయ.. షాకింగ్ పాత్రనట