https://oktelugu.com/

సీఎం జగన్ సాయం కోరిన ఆనందయ్య.. ఎందుకంటే?

నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆనందయ్య మందుకు అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు అనుమతివ్వడంతో ఆయన మందు తయారీ చేసి ప్రజలకు పంచుతున్నారు. అయితే డిమాండ్ అధికంగా ఉండడం.. ఆనందయ్య వద్ద సరిపడా మూలికలు లేకపోవడంతో ఆయన ప్రభుత్వ సాయం కోరారు. తాజాగా ఏపీ సీఎం జగన్ కు ఆనందయ్య లేఖ రాశారు. ఆయుర్వేద కరోనా నివారణ ఔషధం తయారీకి సామగ్రి మూలికలు తదితర సహకారం […]

Written By:
  • NARESH
  • , Updated On : June 8, 2021 / 11:10 AM IST
    Follow us on

    నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆనందయ్య మందుకు అటు ప్రభుత్వం, ఇటు హైకోర్టు అనుమతివ్వడంతో ఆయన మందు తయారీ చేసి ప్రజలకు పంచుతున్నారు. అయితే డిమాండ్ అధికంగా ఉండడం.. ఆనందయ్య వద్ద సరిపడా మూలికలు లేకపోవడంతో ఆయన ప్రభుత్వ సాయం కోరారు.

    తాజాగా ఏపీ సీఎం జగన్ కు ఆనందయ్య లేఖ రాశారు. ఆయుర్వేద కరోనా నివారణ ఔషధం తయారీకి సామగ్రి మూలికలు తదితర సహకారం అందించాలని ఆనందయ్య లేఖలో విన్నవించారు. ఎక్కువ మొత్తంలో మందును తయారు చేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు.

    మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

    ఇక నెల్లూరు జిల్లాలోని మునుబోలు మండలంలో ఆనందయ్య మందును పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్ల ద్వారా ఈ ఔషధాన్ని ఇంటింటికి చేరవేస్తున్నారు. మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పోలీసులు అనుమతించడం లేదు. కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించారు.

    ఆనందయ్య ఔషధంలో ఒకటైన ‘కే’ రకానికి హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మందును రాష్ట్ర ప్రజలందరికీ అందజేయడానికి ప్రభుత్వం సహకారం కావాలని.. ప్రభుత్వం నుంచి తనకు సాయం అందడం లేదని ఆనందయ్య నిన్న ఆవేదన చెందారు.