Anam Venkata Ramana Reddy: ఏపీలో పేదోడి తరుపున పెత్తందార్లతో పోరాడుతున్నట్లు జగన్ తరచూ చెబుతుంటారు. తాను పేదవాడినని, పేదల పక్షాన పోరాడుతున్నానని, నాకు మీడియా సంస్థలు లేవని తరచూ చెబుతుంటారు. ఈ నేపథ్యంలో టిడిపి నాయకుడు ఆనం వెంకటరమణారెడ్డి ” జగన్ రెడ్డి పేదోడా” అంటూ ప్రశ్నిస్తూ.. ఏకంగా సీఎం జగన్ సతీమణి పేరిట ఉన్న ఆస్తుల చిట్టాను బయటపెట్టారు. ఆమె కంపెనీలకు సంబంధించి షేర్ల వివరాలతో కూడిన డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేశారు. ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సీఎం జగన్ భారతి కొన్ని పరిమిత కంపెనీలకు డైరెక్టర్ గా ఉన్నారని, అందులో షేర్లు కలిగి ఉన్నారని తెలుసు. కానీ ఆమె ఏకంగా 17 కంపెనీల్లో భాగస్వామి అని తేలడం విశేషం. భగవతి సన్నిధి ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, కార్మల్ ఏసియా హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హరీష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందిరా టెలివిజన్, జగతి పబ్లికేషన్స్, వైయస్సార్ ఫౌండేషన్.. ఇలా అనేక కంపెనీల్లో భారతి డైరెక్టర్గా ఉన్నారు. ఇవన్నీవైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక పెట్టిన కంపెనీలు. ఇవన్నీ వేలకోట్ల రూపాయల టర్నవర్ చేస్తున్నాయి. అయినా సరే తాను ఒక పేదవాడినని.. తన భార్యతో తనకు సంబంధం లేదని జగన్ చెప్పుకోవడం విశేషం.
వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు భారతి సిమెంట్స్ కంపెనీ వెలుగులోకి వచ్చింది. 2008లో అసలు ఆ కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదు. కానీ 10 రూపాయల షేర్ ను 110 రూపాయలకు విక్రయించగలిగారు. అక్కడికి ఏడాది తర్వాత అదే షేర్ 1440 రూపాయలకు విక్రయించారు. 2009లో మొదటి బస్తా ఉత్పత్తి బయటకు వచ్చింది. అక్కడకు ఆరు నెలల తర్వాత ఫ్రెంచ్ కంపెనీ 51% షేర్లను 2706 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే మెజారిటీ షేర్లు ఫ్రెండ్స్ కంపెనీ కైవసం చేసుకుంది. కానీ ఫ్రెండ్స్ కంపెనీ ప్రతినిధికి ఏడాదికి 33 లక్షల రూపాయల వేతనం మాత్రమే అందుతోంది. కానీ వైయస్ భారతికి మాత్రం అన్ని అలవెన్స్లతో కలుపుకొని ఏడాదికి రూ.3.90 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉండడం విశేషం. దీనినే బయటకు తీశారు ఆనం వెంకటరమణా రెడ్డి. ఇప్పుడు చెప్పండి జగన్ రెడ్డి ఎవరు పేదోడు? అని ప్రశ్నించారు.
సీఎంగా జగన్ బాధ్యతలు స్వీకరించాక భారతి సిమెంట్స్ ఆదాయం పెరిగింది. జగన్ తో పాటు ఆయన భార్య భారతి షేర్ల విలువ కూడా పెరిగాయి. జగన్కు భారతి సిమెంట్స్ లో 2.38 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ సుమారు 2380 కోట్లు, సిలికాన్ బిల్డర్స్ లో 1.50 కోట్ల షేర్లు ఉన్నాయి. వీటి విలువ అక్షరాల 1500 కోట్లు, ఇక జగన్ కు, భారతికి కలిపి 4,500 కోట్ల విలువ చేసే షేర్లు ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతి సిమెంట్ వినియోగించాలన్న ఆదేశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ చిన్న నిర్మాణ పని జరిగిన ప్రభుత్వపరంగా భారతి సిమెంట్స్ ని సిఫారసు చేస్తున్నారు. ఇలా నాలుగున్నర ఏళ్లలో ఆదాయం తో పాటు, భారతి సిమెంట్స్ టర్నోవర్ పెరిగింది. ముమ్మాటికి ఇది రాజకీయ ప్రయోజనమే. క్విడ్ ప్రో కు మించినదే. దీనిపై సిఐడి చీఫ్ సంజయ్ దర్యాప్తు చేయగలరా? దొంగ కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టి ముసిముసి నవ్వులు నవ్వుతున్న వారు విచారణకు ఆదేశించగలరా అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భార్యకు దోచి పెడుతున్న నువ్వా మాట్లాడేది అంటూ జగన్ ను ఆనం వెంకటరమణారెడ్డి ఓ రేంజ్ లో వేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇవే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.