Varun Tej Marriage Video: ఈ రోజుల్లో ప్రతి విషయం వ్యాపారత్మకమే. ఒకప్పుడు పెళ్లి అంటే బంధువులు, సన్నిహితులు కలిసి చేసే తంతు. తలో పని అందుకుని పెళ్లి పూర్తి చేసేవాళ్ళు. ఇప్పుడు పందిరి వేయడం నుండి అప్పగింతలు పెట్టే వరకు అన్ని పనులకు మనుషులను సప్లై చేసే కాంట్రాక్టర్లు ఉన్నారు. డబ్బులిస్తే ప్రతి పని చేసే సంస్థలు ఉన్నాయి. కొత్త ట్రెండ్ ఏమిటంటే… సెలెబ్స్ పెళ్లి వీడియోలను ఓటీటీ సంస్థలు కోట్లు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి.
గత ఏడాది నయనతార-విగ్నేష్ శివన్ మహాబలిపురంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఫోటోలు, వీడియోల హక్కులను నెట్ఫ్లిక్స్ అమ్మేశారు. స్వయంగా నెట్ఫ్లిక్స్ టీం పెళ్లిని షూట్ చేసింది. పెళ్ళైన కొద్దిరోజులకు నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. గతంలో ఇలా ఓ సెలెబ్ వివాహాన్ని ఓటీటీ సంస్థలు కొన్న దాఖలాలు లేవు. తాజాగా టాలీవుడ్ లో కూడా ఈ ట్రెండ్ మొదలైంది.
మెగా హీరో వరుణ్ తేజ్-లావణ్య ఇటలీ దేశంలో నవంబర్ 1న వివాహం చేసుకున్నారు. మూడు రోజులు గ్రాండ్ గా వివాహం జరిగింది. ఇక ఈ పెళ్లిలో మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ సందడి చేశారు. అందుకే ఈ పెళ్లి నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. ఈ క్రమంలో వరుణ్-లావణ్యల పెళ్లికి భారీ డిమాండ్ ఏర్పడింది.
కాగా నెట్ఫ్లిక్స్ వరుణ్-లావణ్యల పెళ్లి వీడియో హక్కులను సొంతం చేసుకున్నారట. త్వరలో ఈ పెళ్లి వీడియోలో స్ట్రీమ్ కానుందట. అందుకు కాగా రూ. 10 కోట్లు చెల్లించారట. పది కోట్లు అంటే మామూలు విషయం కాదు. నాగబాబు పెళ్ళికి రూ. 10 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. నెట్ఫ్లిక్స్ చెల్లించిన డబ్బులతో పెళ్లి ఖర్చు కవర్ అయ్యింది. ఆదివారం టాలీవుడ్ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ మొత్తం ఈ వేడుకలో పాల్గొన్నారు.