Anushka Sharma-Virat Kohli: జనరల్‌గా ప్రేమించుకున్న వాళ్లు అందరూ పెళ్లిళ్లు చేసుకునే పరిస్థితులు ఉండవు. కానీ, కొందరు మాత్రం తప్పకుండా తాము ప్రేమించిన వారిని జీవితంలో భాగస్వామిగా ఉండాలని అనుకుంటారు. ఇక సెలబ్రిటీలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు చాలా మందే ఉన్నారు. అందులో విరుష్క(విరాట్ కోహ్లీ, అనుష్క)జంట బాగా ఫేమస్. వీరు ఏం చేసినా సోషల్ మీడియాలో ఫుల్ డిస్కషన్ జరుగుతుంటుంది. నెటిజన్లు విరుష్క జంట గురించి చర్చిస్తూనే ఉంటారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ .. బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్, ప్రొడ్యూసర్ అనుష్క శర్మను మ్యారేజ్ చేసుకున్నారు. వీరిరువురు డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్నప్పటికీ ప్రేమ చిగురించింది. అది పెళ్లితో విడదీయలేని బంధంగా మారింది. ఇక వీరు ఎవరికి వారు సంపాదిస్తూనే ఉన్నారు. తరగని ఆస్తిని కూడబెట్టేస్తున్నారు. ఇక వీరి కూతురు వామికను సోషల్ మీడియాకి దూరంగా ఉంచుతున్నారు. 2017లో ఇటలీలో వీరి మ్యారేజ్ జరిగింది. మోస్ట్ లవెబుల్ సెలబ్రిటీ కపుల్‌గా వీరున్నారు. నిజానికి విరాట్ కోహ్లీ కంటే అనుష్క శర్మ ఆరు నెలలు పెద్ద అయినా వీరి మ్యారేజ్ జరిగింది. వీరు ప్రేమ విషయం చాలా కాలం పాటు సీక్రెట్‌గా ఉండింది.
మీడియాలో కొన్ని వార్తలు వచ్చినప్పటికీ అంతగా ప్రచారం అయితే జరగలేదు. సాధారణ ప్రేమికుల మాదిరిగానే వీరిద్దరి మధ్య కూడా గొడవలు జరిగాయి. అయితే, వీరి మధ్య గొడవలు ఒకానొక దశలో తారాస్థాయికి చేరి బ్రేకప్ దాకా వెళ్లాయట. 2016లో అలా జరిగిందని వార్తలొస్తున్నాయి. అయితే, ఆ గొడవల వల్ల వారి బంధం ఇంకా బలపడిందనే చెప్పొచ్చు. తర్వాత కాలంలో వారిరువురు చక్కగా కూర్చొని చర్చించుకుని మళ్లీ బంధంలో కొనసాగారట. అలా మొత్తంగా వారి ప్రేమను పెళ్లిగా మార్చుకునే మందర ఏడేళ్ల పాటు రిలేషన్ షిప్, డేటింగ్‌లో ఉన్నారు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.
Also Read: త్వరలోనే ఏపీలో సినిమా టికెట్ ఇష్యూపై పరిష్కారం దొరుకుతుందన్న నటుడు ఆలీ…
విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మధ్య ఏదేని గొడవలు జరిగినప్పుడు ఇద్దరూ ఒకరికి మరొకరు సారీ చెప్పకుంటారట. తప్పు జరిగినట్లు గ్రహించిన వెంటనే విరాట్ కోహ్లీ అనుష్క శర్మకు క్షమాపణ చెప్పారట. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనే అనుష్క శర్మ కండీషన్‌ను విరాట్ కోహ్లీ ఒప్పుకున్నారట. అలా వివాహ బంధంలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ముందుకు సాగుతున్నారు. వరల్డ్‌లోనే ఎక్కువ ఇన్‌కమ్ పొందిన క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు విరాట్ కోహ్లీ. ఇక ఆయన వైఫ్ అనుష్క శర్మ బాలీవుడ్‌లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా ఉన్నారు.
Also Read: ఆర్ఆర్ఆర్ ప్రెస్మీట్లో రెడ్శారీ హాట్‌లుక్‌తో ఆకట్టుకున్న అలియా.. నెట్టింట్లో ఫిక్స్ వైరల్