https://oktelugu.com/

Amit Shah: అంబేద్కర్‌ను అమిత్ షా అవమానించారా? లేకపోతే కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందా?

ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తిని పార్లమెంట్‌లో అవమానించడం ఏంటని అమిత్‌ షాపై మండిపడుతున్నారు. అసలు అమిత్ షా నిజంగానే అంబేద్కర్‌ను అవమానించారా? లేకపోతే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కావాలనే సమస్యను పెద్దది చేస్తుందా? అనే విషయాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2024 / 05:45 PM IST

    Amith Shah

    Follow us on

    Amit Shah: భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అంబేద్కర్‌ను అవమానించారని కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. అంబేద్కర్‌ను మేం అవమానించ లేదని, కాంగ్రెస్ పార్టీ అవమానించిందని అధ్యక్ష పార్టీ నేతలు పార్లమెంట్ ముందు ఈ రోజు నిరసనకు దిగారు. అయితే అమిత్ షా వెంటనే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కూడా డిమాండ్ చేశారు. ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తిని పార్లమెంట్‌లో అవమానించడం ఏంటని అమిత్‌ షాపై మండిపడుతున్నారు. అసలు అమిత్ షా నిజంగానే అంబేద్కర్‌ను అవమానించారా? లేకపోతే ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ కావాలనే సమస్యను పెద్దది చేస్తుందా? అనే విషయాలు తెలియాలంటే స్టోరీపై ఓ లుక్కేయండి.

    పార్లమెంట్‌లో అమిత్ షా మాట్లాడుతూ..
    పార్లమెంట్ సమావేశాల్లో అమిత్ షా మాట్లాడుతూ.. అంబేద్కర్ పేరును పదే పదే జపించే బదులు ఏదైనా దేవుడి పేరును స్మరిస్తే ఏడు జన్మల వరకు స్వర్గ ప్రాప్తి లభిస్తుందన్నారు. దీంతో ప్రతిపక్ష పార్టీతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు విరుచుకుపడుతున్నారు. తాను అంబేద్కర్‌ను అవమానించలేదని అమిత్ షా స్పందించిన కూడా.. రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. అమిత్ షా క్షమాపణ చెప్పడంతో పాటు వెంటనే రాజీనామా చేయాలంటున్నారు. అయితే అమిత్ షా నిజంగానే అంబేద్కర్‌ను అవమానించారా అంటే కొందరి మాట అవును అనిపిస్తే.. మరికొందరి మాట కాదనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు పార్లమెంట్‌లో వివాదాలు రావడం సహజం. విపక్ష పార్టీ అన్నాక అధికార పార్టీ ఎప్పుడు ఎలా తప్పుకు దొరుకుతుందని చూస్తుంటారు. అలానే కాంగ్రెస్ పార్టీ వారికి అనుకూలంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వివాదంగా మార్చాయని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు కాంగ్రెస్ పార్టీ అసలు అంబేద్కర్‌కి వ్యతిరేకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని అవమానించిందని అంటున్నారు. ఈ విధంగా ఏ పార్టీ వాళ్లు వారికే సపోర్ట్ చేస్తున్నారు.

    అంబేద్కర్ పేరును కాకుండా దేవుడి పేరును స్మరిస్తే స్వర్గానికి వెళ్తారని అంటే.. కూటమి పార్టీలు ఆయన మాటలను వక్రీకరిస్తున్నాయని కొందరు అంటున్నారు. ఎందుకంటే ఇలా అనడం ఏ విధంగా అవమానించడం అవుతుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అంబేద్కర్‌ను కేవలం ఒక్క కులానికి మాత్రమే పరిమితం చేసి దేశం ఎప్పుడో అవమానించిందని అంటున్నారు. గ్రామాల్లో లేదా ఎక్కడైనా చూస్తే కేవలం ఆ కులానికి చెందిన ఏరియాలో మాత్రమే అంబేద్కర్ విగ్రహం ఉంటుంది. కానీ అన్ని ప్రదేశాల్లో ఉండదు. మరి ఇది అంబేద్కర్‌ను అవమానించడం కాదా? ఇప్పుడు అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని అంటున్నారు. మరి దీనికి మీకు ఏం అనిపిస్తుంది? అమిత్ షా కావాలనే అంబేద్కర్‌ను అవమానించారా? లేకపోతే కావాలనే కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? కామెంట్ చేయండి.