https://oktelugu.com/

Andhra Pradesh: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణతో యువతకు ఉద్యోగ అవకాశాలు

నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్యాలు అన్నింటిని పెంపొందించి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ట్రెయిన్ అండ్ హైర్ ప్రోగ్రామ్‌ను ఇటీవల ప్రారంభించింది.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 19, 2024 / 05:53 PM IST

    Train and higher program

    Follow us on

    Andhra Pradesh: ప్రస్తుతం చాలా మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. వీరందరికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నైపుణ్యాలు అన్నింటిని పెంపొందించి, ఉద్యోగ అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ట్రెయిన్ అండ్ హైర్ ప్రోగ్రామ్‌ను ఇటీవల ప్రారంభించింది. నిరుద్యోగులకు ఈ ప్రోగ్రామ్ ద్వారా ఉచిత శిక్షణ ఇవ్వనుంది. దీనివల్ల ఈ కార్యక్రమాన్ని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా ఎందరో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు అందుతాయి. ప్రస్తుతం చాలా మందికి సరైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగాలు రావడం లేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

    ఈ ఉచిత శిక్షణ కార్యక్రమంలో మరో ప్రత్యేకత ఉంది. ఎవరో అధికారులు మాత్రమే శిక్షణ ఇవ్వకుండా నేరుగా కంపెనీలో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తాయి. ఉద్యోగ కేటగిరీ బట్టి వాటికి సంబంధించిన సంస్థలే శిక్షణ ఇస్తాయి. శిక్షణ సమయాల్లో ఎలాంటి ఫీజు కూడా తీసుకోరు. నిరుద్యోగులకు కేవలం శిక్షణ ఇస్తుంది. నైపుణ్యాలు ఎవరికి మెరుగ్గా ఉంటే వారికి ఉద్యోగాలు పొందే అవకాశాన్ని ఇస్తుంది. శిక్షణ తీసుకునే వారి దగ్గర నుంచి ఎలాంటి ఫీజు కూడా తీసుకోదు. డైరెక్ట్‌గా యూనివర్సిటీలు, కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటారు. ఇలా ఈ ప్రోగ్రామ్ నిర్వహించి ఉద్యోగాలు ఇప్పిస్తారు. అవసరమైతే విద్య సంస్థల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటికి కావాల్సిన స్థలాన్ని కూడా కేటాయిస్తారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని నైపుణ్యాలు మెరుగు పరచుకోవాలి. ఇలా చేస్తే భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల వారు మంచి స్థాయిలో ఉంటారు.

    రాష్ట్రంలో ఉన్న యువత అంతా ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొని నైపుణ్యాలు నేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు అందరికి కూడా ఓ మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఉచితంగా శిక్షణ తీసుకుని నైపుణ్యాలు నేర్చుకుంటే ఆర్థికంగా బలంగా ఉంటారని తెలిపింది. ఈ ట్రెయిన్ అండ్ హైర్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది విద్యార్థులు ఇప్పటికే శిక్షణ తీసుకుని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా ఎందరో నిరుద్యోగులకు మంచి అవకాశాన్ని కల్పిస్తుందని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో ఇంకా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి భవిష్యత్తుకే కాకుండా రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కూడా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.