Preity Mukundan: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో ఒక రేంజ్ లో వినిపిస్తున్న పేరు ‘ప్రీతీ ముకుందన్ ‘. శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘ఓం భీం బుష్’ అనే చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసిన ఈమె , ఆ సినిమా తర్వాత ‘కన్నప్ప’ చిత్రం లో హీరోయిన్ గా నటించి మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది. ఇక ఆ తర్వాత మలయాళం లో కొన్ని సినిమాలు , తమిళం లో కొన్ని సినిమాలు చేసింది. తమిళ ఇండస్ట్రీ ఈ ఏడాది ఈ కుర్ర హీరోయిన్ కి అద్భుతంగా కలిసొచ్చింది అనే చెప్పాలి. ఆమె హీరోయిన్ గా నటించిన ‘బ్లాస్ట్’, ‘ఇదాయం మురళి’ చిత్రాలు కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా ‘బ్లాస్ట్’ అయితే సైలెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసింది.
తమిళం తో పాటు తెలుగు లో కూడా ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓటీటీ ద్వారా అయితే హిందీ, కన్నడ , మలయాళం భాషలకు సంబంధించిన ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. దీంతో ప్రీతీ ముకుందన్ పేరు సోషల్ మీడియా లో మారుమోగిపోయింది. ఆమె అందానికి , నటనకు కురాళ్ళ మంత్రముగ్దులు అయిపోయారు అనడంలో అతిశయోక్తి లేదేమో. అయితే ఈమెకు సంబంధించిన సమాచారం కోసం గూగుల్ లో వెతకగా , కొన్ని విస్తుపోయే సమాచారాలు బయటపడ్డాయి. ఈమె తాత ఎవరో కాదు, మన దేశం ఎంతగానో గర్వించే గణితశాస్త్ర శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ మునిమనవరాలు అట. ఈ విషయం సోషల్ మీడియా లో నిన్నటి నుండి ఒక రేంజ్ లో ప్రచారం జరిగింది. ఇందులో నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా, అది వాస్తవం కాదని తెలిసింది.
శ్రీనివాస రామానుజన్ , ప్రీతి ముకుందన్ బంధువులు అవుతారట. ప్రీతి ముత్తాత (తల్లి వైపు) రామానుజన్ సోదరుడు అట. ఆ విధంగా ప్రీతి రామానుజన్ కి బంధువు అయ్యింది కానీ , ఆమె మునిమనవరాలు అనే వార్తలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఇకపోతే ప్రీతి తిరుచారాపల్లికి చెందిన NIT లో బీటెక్ చేశారు. మంచి విద్యార్థిగా పేరొందిన ఈమె , తన కెరీర్ ని సినిమాగా ఎంచుకుంది. సక్సెస్ అవుతుందో లేదో అని అనుకున్నారు కానీ , బ్లాస్ట్ మూవీ తో ఏకంగా ఈమె సిక్సర్ కొట్టింది అనే చెప్పాలి . రాబోయే రోజుల్లో ఈమె రేంజ్ ఎలా ఉండబోతుందో చూడాలి.
