https://oktelugu.com/

Game Changer : ‘గేమ్ చేంజర్’ చిత్రంలో సునీల్ అడ్డంగా నడవడానికి గల కారణం అదా..? ఆ వ్యాధి ఉన్నోళ్లు ఇలాగే నడుస్తారా!

మరో 21 రోజుల్లో కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : December 19, 2024 / 05:15 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : మరో 21 రోజుల్లో కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. దాదాపుగా 7 ఏళ్ళ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్న సోలో హీరో చిత్రమిది. #RRR తర్వాత రాబోతున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. రేపటి నుండి ప్రొమోషన్స్ ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. నార్త్ అమెరికా లోని డల్లాస్ స్టేట్ లో ఒక థియేటర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని 21న జరపనున్నారు. డైరెక్టర్ శంకర్ ఈ ఈవెంట్ కి వస్తాడో, రాడో తెలియదు కానీ, రాంచరణ్ , దిల్ రాజు, కైరా అద్వానీ, అలాగే మిగిలిన నటీనటులంతా హాజరు కాబోతున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా టీజర్స్ లో, ప్రోమోస్ లో కమెడియన్ సునీల్ ని చూసి అభిమానులకు అనేక ప్రశ్నలు తలెత్తాయి.

    అదేమిటంటే టీజర్ లో సునీల్ డిప్ప కటింగ్ ఏసుకొని సాధారణ మనుషులు లాగా నడవకుండా, అడ్డంగా నడవడం మనమంతా చూసే ఉంటాము. ఇదేందీ సునీల్ ఇలా నడుస్తున్నాడు. ఈ క్యారక్టర్ ఎదో తేడా అయ్యేలా ఉందే, అసలే శంకర్ కామెడీ సన్నివేశాలు తియ్యడం లో వీక్. ఇప్పుడు సునీల్ తో ఇలాంటి విచిత్రమైన క్యారక్టర్ వేయించాడు. సినిమా మీద ఏదైనా ప్రభావం పడుతుందా అని సోషల్ మీడియా లో భయాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు వేశారు. అయితే సునీల్ కి ఈ సినిమాలో పుట్టుకతోనే ఒక డిజార్డర్ తో పుడుతాడట. ఎదురు గా నిలబడి నడవడం అంటే అతనికి చిన్నప్పటి నుండి భయమట. అందుకే అతను వింత మనిషి లాగా అడ్డంగా నడుస్తూ ఉంటాడు. సినిమాలోని కామెడీ సందర్భాల్లో సునీల్ క్యారక్టర్ నవ్వు రప్పించొచ్చు.

    కానీ సీరియస్ మాస్ సన్నివేశాల్లో కూడా సునీల్ ఇలా అడ్డం గా నడవడం వల్ల ఆ సన్నివేశం లో ఉన్న సీరియస్ నెస్ పోతుందేమో అని అభిమానులు భయపడుతున్నారు. రీసెంట్ గా కొద్దిరోజుల క్రితమే ఒక చిన్న ప్రోమోని మూవీ టీం విడుదల చేసిన సంగతి తెలిసిందే. టీజర్ లోని షాట్స్ ని ఎక్కువగా పెట్టి, చివర్లో ఒక కొత్త షాట్ ని జత చేసారు. ఈ షాట్ ని గమనిస్తే రామ్ చరణ్ విలన్ గ్యాంగ్ ఇంటికి వెళ్లి మాస్ వార్నింగ్ ఇచ్చే సన్నివేశంగా అనిపించింది. ఈ సన్నివేశం లో కూడా సునీల్ అడ్డంగా నడుస్తూ కనిపిస్తాడు. ఇదే అభిమానులను కంగారుకి గురి చేస్తుంది. ఈరోజు సినిమాలోని కొన్ని సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది మూవీ టీం. అందులో కూడా ఒక ఫొటోలో రామ్ చరణ్ స్టైల్ గా నడుస్తుండగా, సునీల్ అడ్డంగా నడుస్తున్నాడు. సినిమాలో ఆయన రామ్ చరణ్ కి అసిస్టెంట్ క్యారక్టర్ చేస్తున్నట్టుగా అర్థమైంది, కానీ సీరియస్ సిట్యుయేషన్స్ లో సునీల్ క్యారక్టర్ ఏమైనా ప్రభావం చూపిస్తుందా లేదా అనేది చూడాలి.