వ్యాక్సిన్ వద్దంటున్న అమెరికన్లు.. కారణమేంటి?

కరోనా ప్రపంచాన్నే కుదిపేస్తోంది. దీనికి ఏ దేశం మినహాయింపు కాదు. దీంతో దిద్దుబాటు చర్యల కోసం దేశాధినేతలు పాట్లు పడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ తో మహమ్మారికి చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం టార్గెట్ పెట్టుకుని లక్ష్యం చేరుకునేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఈ మధ్య వ్యాక్సినేషన్ విషయంలోప్రజలు శ్రద్ధ చూపించడం లేదు. దీంతో అనుకున్న సమయంలో లక్ష్యం చేరడం కష్టంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలన చేపట్టి […]

Written By: Srinivas, Updated On : June 20, 2021 1:19 pm
Follow us on

కరోనా ప్రపంచాన్నే కుదిపేస్తోంది. దీనికి ఏ దేశం మినహాయింపు కాదు. దీంతో దిద్దుబాటు చర్యల కోసం దేశాధినేతలు పాట్లు పడుతున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తున్న వేళ వ్యాక్సిన్ తో మహమ్మారికి చెక్ పెట్టేందుకు అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం టార్గెట్ పెట్టుకుని లక్ష్యం చేరుకునేందుకు శ్రమిస్తున్నారు. అయితే ఈ మధ్య వ్యాక్సినేషన్ విషయంలోప్రజలు శ్రద్ధ చూపించడం లేదు. దీంతో అనుకున్న సమయంలో లక్ష్యం చేరడం కష్టంగా మారుతోంది.

అమెరికా అధ్యక్షుడు బైడెన్ పరిపాలన చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా 100 మిలియన్ల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని కేవలం 56 రోజుల్లోనే 100 మిలియన్ల మందికి టీకా ఇవ్వడంలో సఫలీకృతులయ్యారు. ఆ తరువాత వంద రోజుల్లో 200 మిలియన్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. దీన్ని కూడా బైడెన్ ప్రభుత్వం విజయవంతంగా సాధించింది. ఈ నేపథ్యంలో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా స్వాతంత్ర్యం రోజున జులై 4 నాటికి 70 శాతం మంది అమెరికన్లకు కనీసం ఒక డోసు టీకా తీసుకునే విధంగా చూడాలని బైడెన్ నిశ్చయించారు.

తాజా గణాంకాల ప్రకారం శుక్రవారం నాటికి కేవలం 65.1 శాతం మంది అమెరికన్లు మాత్రమే కనీసం ఒక డోసు తీసుకున్నారు. గత రెండు వారాలుగా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్యను పరిశీలిస్తే అది ఒక శాతం కంటే తక్కువగానే ఉంది. ఈ క్రమంలో బైడెన్ తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరో రెండు వారాల్లో 5 శాతం మంది అమెరికన్లు వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రావడం సాధ్యం కాకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం తగ్గుతుందనే పుకార్లు అమెరికాలో పుట్టుకొస్తున్నాయి. దీంతో వాటిని అమెరికన్లు వాటిని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో వ్యాక్సిన్ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. శాస్ర్తవేత్తలు మాత్రం ఇదంతా బూటకమని చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. వ్యాక్సినేషన్ పై వచ్చిన అపోహలను తొలగించి ప్రజలను చైతన్యవంతులను చేస్తే తప్ప వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుకు రారనే విషయం తెలుస్తోంది.