America- Kashmir: ఆకాశాన్ని తాకేలా ఉండే మంచుకొండలు. కళ్ళు మిరమిట్లు గొలిపే తులిప్ పుష్పాలు.. చర్మానికి మరింత యవ్వనాన్ని తీసుకొచ్చే కుంకుమపువ్వు.. ఎరుపును తమలో పూర్తిగా నిక్షిప్తం చేసుకునే ఆపిల్ పండ్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కాశ్మీర్ వర్ణన పదాలకు సరిపోదు. అటువంటి కాశ్మీర్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం మారణ హోమం సృష్టిస్తుంటారు. ఫలితంగా భూతల స్వర్గంగా వినతికి ఎక్కాల్సిన సుందర కాశ్మీరం కల్లోల ప్రాంతంగా కునారిల్లుతోంది. మన దేశ రక్షణ శాఖ ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్లో సింహభాగం కాశ్మీర్లో భద్రత కోసమే ఖర్చు చేస్తోంది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చేదాకా కాశ్మీర్లో ప్రత్యేక రాజ్యాంగం అమలు అయ్యేది. కానీ ఎప్పుడైతే ఆర్టికల్ 370 రద్దు చేశారో అప్పుడే ఈ దేశంలో ఒకటే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇక ఈ సమస్యను పరిష్కరించాలని భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో పలుమార్లు విజ్ఞప్తి చేసింది. అయితే ఎదుటి ఇల్లు కాలిపోతే ఆ మంటలో చలికాచుకునే చైనా, అమెరికా వంటి దేశాలు కాశ్మీర్ సమస్యను నానాటికి జటిలం చేస్తున్నాయి. పైగా పాకిస్తాన్ దేశానికి అంతర్గతంగా సహాయం చేస్తూ భారతదేశం పైకి ఉసిగొల్పుతున్నాయి. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ అనుసరించిన విధానాన్ని పై దేశాలు ఈ వర్తమాన కాలంలో అమలులో పెడుతున్నాయి.

ఏ విధంగా అర్థం చేసుకోవాలి
మొన్నటికి మొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాకిస్తాన్ దేశాన్ని అత్యంత ప్రమాదకర ఉగ్రవాద దేశంగా అభివర్ణించారు. కానీ కొద్ది రోజులకే పాకిస్తాన్ దేశానికి ఎఫ్ 16 ఎయిర్ క్రాఫ్ట్ లను అందజేసి తమ దౌత్య విధానం గొప్పదని జబ్బలు చరుచుకున్నారు. వాస్తవానికి రష్యా దేశాన్ని ఏకాకిని చేసి తమ వైఖరికి మద్దతు ఇవ్వని భారతదేశాన్ని చికాకు పెట్టేందుకు పశ్చిమ దేశాలు వివిధ ప్రపంచ వేదికలపై కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తుతున్నాయి.. ఇటీవల అమెరికా రాయబారి డోనాల్డ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పర్యటించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. జర్మనీ మంత్రి అనాలినా బేర్ బాక్ జమ్ము కాశ్మీర్ సమస్యపై పాకిస్తాన్ దేశానికి తన మద్దతు ప్రకటించారు. ఇవన్నీ కూడా భారత్ కు ప్రపంచంలో పెరుగుతున్న పలుకుబడిని గుర్తించి ఇబ్బంది పెట్టేందుకు చేస్తున్న పన్నాగాలు గానే భావించాలి.
వారు కొంచెం నయమే
అమెరికా పూర్వ అధ్యక్షులుగా కాశ్మీర్ విషయంలో భారత్ కు కొన్ని సందర్భాల్లో అండగా నిలిచారు.. కానీ దీర్ఘకాలం ఆ విధానాన్ని అనుసరించలేకపోయేవారు.. భారతదేశాన్ని బుజ్జగిస్తూ… పాకిస్తాన్ దేశంతో సంబంధాలు నెరుపుతూ బెదిరించడం వంటివి చేసేవారు. రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు ఇండియాను అమెరికాతో పాటు కొన్ని పశ్చిమ దేశాలు విమర్శిస్తున్నాయి.. సొంత ఆంక్షలు నుంచి తమను తాము మినహాయించుకుని రసా నుంచి పాశ్చాత్య దేశాలు ముడిచమురు దిగుమతి చేసుకుంటున్నాయి.. ఇదే విధానాన్ని అవలంబిస్తున్న భారతదేశాన్ని మాత్రం అవి తప్పు పడుతున్నాయి.. ఇది వాటి రెండు నాలుకల ధోరణికి నిదర్శనం.. రష్యా, క్రయన్ యుద్ధం ప్రారంభమైన వెంటనే భారత ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా రాయితీపై వచ్చే ముడిచారు దిగుమతులను నిలిపివేయాలని అమెరికా కోరడం గమనార్హం.

ఇదే దశలో భారత ప్రయోజనాలకు లబ్ధి కలిగిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వ్యవహరించారు. ఇక భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో పాకిస్తాన్ దీనిని బూచిగా చూపి గతంలో ముగిసిపోయిన ఐరోపా దేశాలతో సంబంధాలను పునరుద్ధరించుకుంటుంది.. ఇదే అదునుగా ఆయా దేశాలు పాకిస్తాన్తో ఆయుధ వ్యాపారం చేసేందుకు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి.. అయితే బలమైన దౌత్య విధానంతో మాత్రమే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని భారత్ భావిస్తోంది.. ఇందుకు అనుగుణంగానే పావులు కదుపుతోంది. అందుకే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి అమెరికా దేశంలోనే అమెరికా తీరును ఎండ గడుతున్నారు. అయితే తన ప్రయోజనాల విషయంలో ఏ మాత్రం రాజీ పడని అమెరికా దీనిని ఎలా తీసుకుంటుందో వేచి చూడాలి.