Bigg Boss 6 Telugu- Geetu Re-Entry: బిగ్ బాస్ సీజన్ 6 ప్రేక్షకులందరిని బాగా ఎమోషనల్ చేసిన ఎలిమినేషన్ ఏదైనా ఉందంటే అది గీతూ రాయల్ దే..టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలవాల్సిన ఈమె టాప్ 10 కంటెస్టెంట్స్ లో ఒకరిగా కూడా నిలబడదు అనేది గీతూ -హౌస్ మేట్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా ఊహించలేకపోయారు..ఇప్పటికి ఆమె ఎలిమినేట్ అవ్వలేదని.. ఏదో ఒకరోజు కచ్చితంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తుందని నమ్మేవాళ్ళు సంఖ్య ఎక్కువే.. హౌస్ లో ఆమె క్లోజ్ ఫ్రెండ్ ఆది రెడ్డి కూడా ఇది బలంగా నమ్ముతున్నాడు.. మొన్న వీకెండ్ లో కూడా నాగార్జున ‘గీతూ ఇంకా సీక్రెట్ రూమ్ లోనే ఉంది అనుకుంటున్నావా ఆది రెడ్డి’ అని అడుగుతాడు.

అప్పుడు ఆది రెడ్డి ‘అవును సార్..నాకు బలమైన నమ్మకం ఉంది..గీతూ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కాదు’ అని అంటాడు..అప్పుడు నాగార్జున ‘అవునా..సరే చూద్దాం నీ నమ్మకం ఎంతవరుకు నిజమో’ అని అంటాడు..అంటే నాగార్జున గీతూ రీ ఎంట్రీ ఇవ్వబోతుందని హింట్ ఇస్తున్నాడా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
ఇక పోయినవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా ఎవ్వరు ఊహించలేదు.. గత సీజన్స్ ని చూసుకుంటే డబుల్ ఎలిమినేషన్ రెండు సార్లు జరిగినట్టు ఎక్కడా దాఖలాలు లేవు.. కానీ ఈ సీజన్ లో రెండుసార్లు అలా జరిగింది..పోయినవారం జరిగిన డబుల్ ఎలిమినేషన్ లో అతి తక్కువ ఓటింగ్స్ వచ్చిన బాలాదిత్య – వాసంతి ఎలిమినేటైనా సంగతి మన అందరికి తెలిసిందే..అలా డబుల్ ఎలిమినేషన్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది అంటున్నారు విశ్లేషకులు.

వచ్చే వారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉంటుందని..అందుకోసమే డబుల్ ఎలిమినేషన్ నిర్వహించారని..మరి ఈ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టే ఎక్కువ అవకాశాలున్న కంటెస్టెంట్స్ గీతూ – సూర్య అని.. వీరిద్దరిలో గీతూనే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టబోతుందని విశ్వనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.. మరి ఇందులో ఎంత వరుకు నిజం ఉందొ తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాలి..ఒకవేళ గీతూ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇస్తే ఆట మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.