America Visa
America Visa : ఉన్నత చదువులు చదివిన ప్రతి ఒక్కరికి అమెరికా వెళ్లి మంచి జాబ్ చేయాలని, అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. అమ్మాయిలైతే అమెరికా అబ్బాయిని చేసుకోవాలని కోరుకుంటారు. తల్లిదండ్రులైతే తమ కూతురికి అమెరికా అల్లుడిని తేవాలని ఆలోచిస్తుంటారు. ఇలా ప్రతి ఒక్కరి కల అయిన అమెరికా డ్రీమ్స్ ఇప్పుడు నెరవేరే పరిస్థితి లేదు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక అయిన తర్వాత పరిస్థితులన్నీ తారుమారు అయ్యాయి. ఇప్పటికే అమెరికాలో ఉన్నత విద్య కోసం వచ్చిన భారతీయ విద్యార్థులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక, వీసా సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Also Read : వీసా ఆశలు ఆవిరి.. లిమిట్ ఓవర్ అని ప్రకటించిన అమెరికా.. భారతీయ విద్యార్థులకు వార్నింగ్..!
అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేయడానికి వచ్చిన భారతీయ విద్యార్థులు, ప్రస్తుతం ఉద్యోగాలకూ, వీసాకు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారు తీసుకున్న భారీ రుణాలను చెల్లించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం H1B వీసా లాటరీ అవకాశాలు తగ్గినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే దరఖాస్తు గడువు మార్చి 24 దగ్గరపడింది. OPT (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ద్వారా కొద్దిగా అవకాశం ఉన్నప్పటికీ స్పాన్సర్‌షిప్ గ్యారంటీ లేకపోవడం వల్ల అది పూర్తి భరోసా ఇవ్వడం లేదు.
అమెరికాలో ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థులను నియమించేందుకు కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ఉద్యోగాల కోసం పోటీ మరింత కఠినంగా మారింది. రెండవ మాస్టర్స్ చేయడం మరింత రుణ భారాన్ని మాత్రమే పెంచుతుంది. కానీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచదు. ప్రస్తుతం అమెరికాలో 300,000కి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. వారు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు మరింత తీవ్రతరంగా మారే అవకాశం ఉంది. తద్వారా మరికొందరు స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకునే అవకాశం కనిపిస్తుంది. ఈ పరిస్థితి భారతీయ విద్యార్థుల భవిష్యత్తుకు సంక్షోభాన్ని సూచిస్తుంది. ప్రభుత్వం స్పందించి తక్షణ పరిష్కారాలు ఆలోచించాల్సి ఉంది.
Also Read : అమెరికాకు టూరిస్టుగా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్!