Homeబిజినెస్Jiohotstar: యూజర్లకు షాక్‌ ఇవ్వనున్న జియోహాట్‌స్టార్‌.. ఇక ఆ వీడియోలు కనిపించవు..

Jiohotstar: యూజర్లకు షాక్‌ ఇవ్వనున్న జియోహాట్‌స్టార్‌.. ఇక ఆ వీడియోలు కనిపించవు..

Jiohotstar: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(Relance Indastries)కు చెందిన జియో సినిమా, డిస్నీ+హార్ట్‌స్టార్‌.. మొన్నటి వరకు వేర్వేరు ప్లాట్‌ఫాంలు. జియో(Jio)ఎక్కువగా క్రికెట్‌ ప్రసారాలతో సబ్‌స్క్రిప్షన్‌ పెంచుకుంది. ఇక డిస్నీ+హార్ట్‌స్టార్‌ వివిద కార్యక్రమాలు, సీరియనల్స్, సినిమాలతో చాలా మంది సబ్‌స్క్రిప్షన్స్‌ను కలిగి ఉంది. ఈ రెండింటి మధ్య పోటీ నెలకొనడంతో ఇటీవల రెండూ జట్టుకట్టాయి. జియోహార్ట్‌స్టార్‌(JioHotstor)గా ఆవిర్భవించాయి. అయితే ఇవి రెండు గతంలో యూట్యూబ్‌లో వీడియోస్‌(You tubes Vedios) అప్‌లోడ్‌ చేశాయి. వాటినే ఎక్కువగా చూసేవారు. అయితే ఇప్పుడు రెండూ ఒక్కటైన నేపథ్యంలో తమ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌ను యూట్యూబ్‌ నుంచి తొలగించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయం మే 1, 2025 నుంచి అమలులోకి రానుందని కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి, అయితే దీనిపై అధికారికంగా నిర్ధారణ కాలేదు.

Also Read: మిగతా జట్ల లాగా.. SRH కు కూడా కెప్టెన్ ను మార్చేస్తే..

విలీనం తర్వాత..
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియోస్టార్, డిస్నీ+ హాట్‌స్టార్‌ మరియు వయాకామ్‌18 విలీనం తర్వాత ఏర్పడిన ఈ సంస్థ, తమ కంటెంట్‌ను ఉచిత డిజిటల్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తీసివేసి, జియో హాట్‌స్టార్‌ వంటి సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లపై పూర్తిగా దృష్టి పెట్టాలని భావిస్తోంది. గతంలో ఉచితంగా అందుబాటులో ఉన్న కంటెంట్‌ (ఉదాహరణకు, IPL లాంటి స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌) ఇప్పుడు పేవాల్‌ వెనుకకు తీసుకెళ్లడం ద్వారా, పే–టీవీ మరియు సబ్‌స్క్రిప్షన్‌ వీడియో–ఆన్‌–డిమాండ్‌ (SVOD) సేవల నుంచి సబ్‌స్క్రైబర్లను కోల్పోకుండా చూసుకోవడం ఈ వ్యూహంలో భాగం. యూట్యూబ్‌ వంటి యాడ్‌–సపోర్టెడ్‌ వీడియో–ఆన్‌–డిమాండ్‌ (AVOD) ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కంటెంట్‌ తొలగించడం ద్వారా, జియోస్టార్‌ తమ ప్లాట్‌ఫారమ్‌లో పెయిడ్‌ సబ్‌స్క్రైబర్‌ బేస్‌ను పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిర్ణయం వల్ల జియో హాట్‌స్టార్‌ వినియోగదారులకు నేరుగా ప్రభావం పడకపోవచ్చు, కానీ యూట్యూబ్‌లో ఉచితంగా కంటెంట్‌ చూసే అలవాటు ఉన్న వారికి ఇది ఒక ‘షాక్‌. ఈ విషయంపై కొంతమంది వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు, ముఖ్యంగా ఉచిత కంటెంట్‌ అందుబాటులో ఉండకపోవడం వల్ల పైరసీ వైపు మళ్లే అవకాశం ఉందని కొందరు ఊహిస్తున్నారు.

జియో హాట్‌స్టార్‌ లేదా జియోస్టార్‌ యూట్యూబ్‌ నుంచి తమ ఎంటర్‌టైన్‌మెంట్‌ వీడియోలను తొలగించడం ద్వారా, తమ సొంత స్ట్రీమింగ్‌ సేవలను బలోపేతం చేయాలని చూస్తోంది. ఇది అమలులోకి వస్తే, వినియోగదారులు జియో హాట్‌స్టార్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ ద్వారానే ఈ కంటెంట్‌ను చూడాల్సి ఉంటుంది, బహుశా సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించి అప్‌డేట్‌ కావొచ్చు.

 

Also Read: పాక్ పరువు సింధు నది పాలు.. ఈసారి ఏం జరిగిందంటే.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version