https://oktelugu.com/

America Visa : అమెరికాకు టూరిస్టుగా వెళ్లే భారతీయులకు గుడ్ న్యూస్!

అవి బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, జలంధర్, కొచ్చిన్‌ పట్టణాల్లో డ్రాపాఫ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరు కేంద్రాల్లో కూడా ‘ఇంటర్వ్యూ మినహాయింపు అర్హులు’ తమ దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఉంది. అయితే అందుకు రూ. 850 చెల్లించాల్సి ఉంటుందని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : April 5, 2024 12:28 pm
    Good news for Indians going to America as a tourist!

    Good news for Indians going to America as a tourist!

    Follow us on

    America Visa : అమెరికాకు టూరిస్టుగా వెళ్లే భారతీయులకు ఆ దేశం కొంత వెసులుబాటు కల్పించింది. వీసా జారీ ప్రక్రియలో పెద్ద ఊరటను ఇచ్చింది. ఇంటర్వ్యూ లేకుండానే వీసాలు జారీకి అనుమతి ఇచ్చింది. ఈ వీసాలన్నీ ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో జారీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

    కాన్సులేట్‌ కార్యాలయాల్లో..
    ఇక అమెరికా టూరిస్టు వీసా కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. సంబంధిత పత్రాలతో దేశంలోని నాలుగు కాన్సులేట్‌ కార్యాలయాల్లో ఉన్న డ్రా బాక్సుల్లో సమర్పించవచ్చు. ఇంటర్వ్యూ అవసరమైన వారు మాత్రమే డిల్లీకి రావాల్సి ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, ముంబయి, కోల్‌కతా కాన్సులేట్‌ కార్యాలయాల్లో కూడా ఇంటర్వ్యూ మినహాయింపు స్లాట్లు అందుబాటులో ఉంచనున్నా.. అవి పరిమితంగా ఉండనున్నాయి.

    వీరు అర్హులు..
    కరోనా సమయంలో వీసాల నిలిపివేత కారణంగా పర్యాటకంగా అమెరికా వెళ్లాలనుకునే వారు స్లాట్ల కోసం వేచి చూస్తున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత గతంలో అమెరికా వీసా ఉండి కనీసం ఒక్కసారైనా ఆ దేశంలో పర్యటించిన వారు, గతంలో జారీ చేసిన వీసా కాల పరిమితి ముగిసి 12 నెలలు మించని వారు ఇంటర్వ్యూ లేకుండా వీసా పొందేందుకు అవకాశం ఉండేది. కొవిడ్‌ కారణంగా నిరీక్షణ జాబితా పెరిగిపోవడంతో.. వీసా గడువు తీరిన 48 నెలల వరకు కూడా ఇంటర్వ్యూ లేకుండా కొత్త వీసా జారీ చేయడానికి అమెరికా అవకాశం కల్పించింది.

    ఆరు కేంద్రాల్లోనూ…
    అమెరికా రాయబార కార్యాలయం, నాలుగు కాన్సులేట్‌ కార్యాలయాల్లోని డ్రాబ్బాక్స్‌ సదుపాయం ద్వారా ఇంటర్వ్యూ మినహాయింపు వీసా దరఖాస్తులను ఉచితంగా సమర్పించవచ్చు. వీటి తోపాటు మరో ఆరు డాక్యుమెంట్‌ డ్రాపాఫ్‌ కేంద్రాల్లో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా నిర్ణయించింది. అవి బెంగళూరు, పుణె, అహ్మదాబాద్, చండీగఢ్, జలంధర్, కొచ్చిన్‌ పట్టణాల్లో డ్రాపాఫ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆరు కేంద్రాల్లో కూడా ‘ఇంటర్వ్యూ మినహాయింపు అర్హులు’ తమ దరఖాస్తులను సమర్పించేందుకు అవకాశం ఉంది. అయితే అందుకు రూ. 850 చెల్లించాల్సి ఉంటుందని అమెరికా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.