https://oktelugu.com/

America: ఆ చట్టం వస్తే అమెరికాలో భారతీయులకు శాశ్వత నివాసం

అగ్రరాజ్యం అమెరికా(America)కు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలన్నది ప్రతి ఒక్కరి భారతీయ యువత కల. ఉద్యోగాలు, ఉపాధి, చదువుల కోసం అమెరికాకు చాలా మంది వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. గత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలో విదేశీయులకు ద్వారాలు మూసేశాడు. ప్రస్తుతం జోబైడెన్ వచ్చాక విదేశీయులకు పెద్దపీట లభిస్తోంది. అమెరికా వెళ్లి చదువుకోవడమే కాకుండా ఉద్యోగం సంపాదించి స్థిరపడాలన్నది కొందరి జీవితకాల కోరిక.గ్రీన్ కార్డు సంపాదించాలన్నది ఇంకొందరి ప్రధాన లక్ష్యం. ఇలాంటి వారి కోసం తాజాగా అమెరికా ప్రభుత్వం ఒక […]

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2021 / 07:35 PM IST
    Follow us on

    అగ్రరాజ్యం అమెరికా(America)కు జీవితంలో ఒక్కసారైనా వెళ్లాలన్నది ప్రతి ఒక్కరి భారతీయ యువత కల. ఉద్యోగాలు, ఉపాధి, చదువుల కోసం అమెరికాకు చాలా మంది వెళ్లడానికి ప్రయత్నిస్తుంటారు. గత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హయాంలో విదేశీయులకు ద్వారాలు మూసేశాడు. ప్రస్తుతం జోబైడెన్ వచ్చాక విదేశీయులకు పెద్దపీట లభిస్తోంది.

    అమెరికా వెళ్లి చదువుకోవడమే కాకుండా ఉద్యోగం సంపాదించి స్థిరపడాలన్నది కొందరి జీవితకాల కోరిక.గ్రీన్ కార్డు సంపాదించాలన్నది ఇంకొందరి ప్రధాన లక్ష్యం. ఇలాంటి వారి కోసం తాజాగా అమెరికా ప్రభుత్వం ఒక నూతన బిల్లును తీసుకొచ్చింది. ఒకవేళ అది చట్టరూపం దాల్చితే భారతీయులకు ఒక గొప్ప వరం లభించినట్టేనని అంటున్నారు.

    పరిమిత ఫీజు చెల్లించి అమెరికాలో శాశ్వత నివాసం (Permanent residency) పొందే వెసులుబాటును అక్కడి ప్రభుత్వం తీసుకొస్తోంది. అమెరికాలో ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ కోసం కొన్నేళ్లుగా వేచిచూస్తున్న మిలియన్ల మంది ప్రజలకు ఇదో గొప్ప శుభవార్తగా మారింది. అమెరికాలో ఉంటున్న భారతీయ ఐటీ నిపుణులకు ఇది ఎంతో సహాయపడుతుందని చెబుతున్నారు.

    యూఎస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ జ్యూడీషియరీ కమిటీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. అమెరికాలో శాశ్వత నివాసం ఉండటానికి ఒఖ కొత్త చట్టం తీసుకురానుంది. దీని ప్రకారం.. ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రెంట్ దరఖాస్తుదారులు అమెరికాలో 2 సంవత్సరాల కంటే ముందు ఉండి తీరాలి. కేవలం 5 వేల డాలర్ల ఫీజు చెల్లించి అక్కడ శాశ్వత నివాసం పొందొచ్చు.అయితే ఈబీ-5 కేటగిరిలో వలస పెట్టుబడిదారుల కోసం రుసం రూ.50 వేల డాలర్లుగా నిర్ణయించారు.ఈ నిబంధనలను 2031 వరకు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

    అమెరికా పౌరులు ఎవరినైనా స్పాన్సర్ చేస్తే మాత్రం అలాంటి కుటుంబాలకు ఇదే 2 ఏళ్ల నిబంధనతో 2500 డాలర్ల ఫీజు చెల్లించి కార్డు పొందొచ్చు. దీనిని ప్రస్తుతం న్యాయవ్యవస్థ కమిటీ, ప్రతినిధుల సభ , సెనేట్ ఆమోదం కోసం పంపారు. అధ్యక్షుడు జోబైడెన్ సైతం సంతకం చేయాలి. అప్పుడే చట్ట రూపంగా మారనుంది. ఒకవేళ చట్టం అయితే మాత్రం అమెరికాకు వచ్చిన ధ్రువీకరణ పత్రాలు లేని వలసదారులు ఈ శాశ్వత యూఎస్ రెసిడెన్సీ లేదా గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఉంటుంది.