Andhra Pradesh: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఏడేళ్లవుతోంది. ఈ కాలంలో చాలా మంది తమ సొంత ప్రాంతానికి వెళ్లిపోయారు. అక్కడ చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఎక్కువగా అక్కడికే వెళ్లడానికి ఇష్టపడుతున్నారు. అయితే గతంలో చంద్రబాబు హయాంలో కూడా అందరు రావాలని ఆహ్వానించినా అక్కడ పరిస్థితుల దృష్ట్యా కొందరు మొగ్గు చూపలేదు. కానీ ప్రస్తుతం జగన్ చేపడుతున్న పథకాలతో ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలుస్తోంది. అందుకే వారి సొంత ప్రాంతానికి రావడానికి ఇష్టపడుతున్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలో ఏపీ సీఎం జగన్ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయి. నగదును ప్రజల ఖాతాల్లోకే వేస్తున్నందున చాలా మంది లబ్ధిపొందాలని భావించి సొంత ఊళ్లకు చేరుతున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన వారు ఎక్కువ మంది వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అక్కడే ఉండిపోయిన వారు జగన్ చేపడుతున్న పథకాల కోసం తమ ప్రాంతాలకు చేరుకుని తహసీల్దార్ కార్యాలయాల్లో తమ వివరాలు నమోదు చేసుకుంటున్నారు. స్థానికత కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వంలో కూడా విద్యావంతులు, పారిశ్రామిక వేత్తలు ఆంధ్రప్రదేశ్ కు రావాలని కోరినా ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ అవకాశాలు లేవనే కారణంతో ముందుకు రాలేదు. వ్యాపారాల కోసం ఏపీకి వస్తే లాభం లేదనుకుని ఆగిపోయారు. పైగా పరిశ్రమలకు పెద్దగా వీలు లేకపోవడంతో ప్రజలు ఆలోచనలో పడిపోయారు. కానీ ప్రస్తుతం పరిస్థితిలో మార్పు వచ్చింది. ఈ నేపథ్యంలో స్థానికత కోసం చాలా మంది దరఖాస్తులు పెట్టుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ వంటి పథకాల కోసం సొంతూళ్ల బాట పడుతున్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏపీ వైపు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో సుమారు లక్ష కుటుంబాల వరకు ఆంధ్రప్రదేశ్ కు చేరుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల్లో పేర్లు లేకపోతే భవిష్యత్ లో అవసరం పడితే నష్టం జరుగుతుందని భావించి తమ వివరాలు నమోదు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. గతంలో చంద్రబాబు హయాంలో ఇలాంటి పథకాలు లేకపోవడంతో చాలా మంది రావడానికి నిరాకరించారు. ఇప్పుడు మాత్రం ఆలోచించడం లేదు.