
గుంటూరు జిల్లాకు చెందిన లక్ష్మీపార్వతి ప్రస్తుతం ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్ గా ఉన్నారు.గుంటూరు జిల్లా సత్తెనపల్లి లోని ధూళిపాళ్ల ఆమె స్వగ్రామం. లక్ష్మీపార్వతికి అక్కడ ఆస్తులున్నాయి. ఇటీవల అక్కడి తన భూముల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జలకళ పథకం’ కింద ఉచితంగా బోర్ వేయించమని స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబును అడిగితే షాక్ తగిలిందట.. తన మనిషిని పంపిస్తే అంబటి రాంబాబు అవమానించి పంపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఫోన్ చేస్తే దారుణంగా మాట్లాడేశారట..
లక్ష్మీపార్వతి రాజకీయాల్లో బిజీ కావడంతో తన భూమిని కోటేశ్వరరావుకు కౌలుకు ఇచ్చింది. ఆమెకు ధూళిపాల్లలో 2.50 ఎకరాల భూమి ఉంది. కోటేశ్వరరావు ప్రస్తుతం బీజేపీ సత్తెనపల్లి మండల అధ్యకుడిగా ఉన్నారు.
ఈ క్రమంలోనే జలకళ పథకంలో తన పొలంలో బోరు వేయించాలని లక్ష్మీ పార్వతి స్వయంగా కోటేశ్వరరావును సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు వద్దకు పంపిందట.. దీంతో ఆయన వెళ్లి కలిశారట.. కానీ బీజేపీ మండల అధ్యక్షుడికి వైసీపీ వేయిస్తుందా? అందుకే వైసీపీ నేతలు అతడు సాగు చేస్తున్న పొలంలో బోరు వేయడానికి అంగీకరించలేదట..
ఈ క్రమంలో కోటేశ్వరరావు స్వయంగా అంబటికి ఫోన్ చేసి బోర్ వేయించాలని కోరాడట.. దీనికి అంబటి.. ‘లక్ష్మీ పార్వతి పొలం గురించి తనకు ఫోన్ చేయొద్దని’ అన్నాడని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనిపై గవర్నర్ కు, సీఎం జగన్ కు ఫిర్యాదు చేస్తానని కోటేశ్వరరావు అంటే.. ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేసుకో అని అంబటి దురుసుగా ఫోన్ పెట్టేశాడట.. ఇప్పుడు ఈ వ్యవహారం ఆ నియోజకవర్గంలో చర్చనీయాంశమైందట.. ఆనోటా ఈనోట ఇది బయటకు వచ్చింది. ఆ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏపీ అకాడమీ చైర్మన్ పొలంలో కూడా బోరు వేయించడానికి వైసీపీ ఎమ్మెల్యే ముందుకు రావడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. బీజేపీ నేతకు లక్ష్మీ పార్వతి కౌలుకు ఇచ్చిందని అంబటి రాంబాబు ఇలా చేస్తున్నాడా? ప్రత్యర్థి పార్టీకి మేలు చేయకూడదని భావిస్తున్నాడా? లేక లక్ష్మీపార్వతితో ఏమైనా విభేదాలా? అన్నది తేలాల్సి ఉంది.
https://www.youtube.com/watch?v=I5CbRdjXkwA