అమ్మకానికి అమరావతి భూములు..!

బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూములు విక్రయించాలని నిర్ణయించడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, ఇతర ముఖ్యనగరాల్లోని విలువైన 200 ఎకరాలపైగా భూములను విక్రయించేందుకు గతంలో టెండర్లు పిలిచింది. ప్రతిపక్షాల నిరసనలతో కొన్ని చోట్ల భూములు విక్రయించే విషయంలో వెనక్కి తగ్గింది. గుంటూరులో జిఎంసి చెందిన నాయుడు మార్కెట్ స్థలాన్ని విక్రయించడంపై జనసేన పోరాటంతో జాబితా నుంచి ఆ స్థలాన్ని తప్పించింది. అప్పడే మొత్తం 2 వేల ఎకరాలను ప్రభుత్వం విక్రయించేందుకు […]

Written By: Neelambaram, Updated On : July 24, 2020 11:43 am
Follow us on

బిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూములు విక్రయించాలని నిర్ణయించడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.  రాష్ట్రంలో విశాఖ, గుంటూరు, ఇతర ముఖ్యనగరాల్లోని విలువైన 200 ఎకరాలపైగా భూములను విక్రయించేందుకు గతంలో టెండర్లు పిలిచింది. ప్రతిపక్షాల నిరసనలతో కొన్ని చోట్ల భూములు విక్రయించే విషయంలో వెనక్కి తగ్గింది. గుంటూరులో జిఎంసి చెందిన నాయుడు మార్కెట్ స్థలాన్ని విక్రయించడంపై జనసేన పోరాటంతో జాబితా నుంచి ఆ స్థలాన్ని తప్పించింది. అప్పడే మొత్తం 2 వేల ఎకరాలను ప్రభుత్వం విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వార్తలు వచ్చాయి. ప్రసుతం హైకోర్టుకు బిల్డ్ ఏపీ మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ సమర్పించిన వివరాలను పరిశీలిస్తే రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున భూములు విక్రయించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.

రాజధాని అమరావతిలో గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం చేసుకుని అభివృద్ధి చేసేందుకు 1,600 ఎకరాలను కేటాయించారు. పనులు ప్రారంభమయ్యే సమయంలో ఎన్నికలు జరగడం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడటం  జరిగింది. జగన్ ప్రభుత్వం ఈ కస్పార్టియంను రద్దు చేసుకుని, కేటాయించిన భూమిని వెనక్కి తీసుకుంది. అనంతరం ఆ 1,600 ఎకరాల భూమిని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నాయకత్వం వహిస్తున్న ఉన్నత స్ధాయి కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం కార్యనిర్వాహక రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించింది. ప్రస్తుతం ఇక్కడ తాత్కాలిక అసెంబ్లీ ఉంది. శాశ్వత భవనం నిర్మించినా 50 ఎకరాల ఉంటే చాలు. దీంతో రాజధాని కోసం గత ప్రభుత్వం సమీకరించిన భూములను విక్రయించడంతో నిధులు సమీకరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ నిర్ణయానికి వచ్చింది.

రాజధాని అమరావతిలో ఇంత పెద్ద మొత్తంలో భూములను అమ్మలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయడంపై రాజధాని ప్రాంత రైతులు, అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులు రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేసిన భూములను జగన్ ప్రభుత్వం విక్రయించాలను కోవడం దారుణమంటున్నారు. ఇటువంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ భూముల విషయంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైంది కాదని ఆర్ధిక రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడలోని పి.డబ్ల్యూ.డి గ్రౌండ్ అభివృద్ధి చేసేందుకు విదేశీ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటే వైసీపీ వ్యతిరేకించింది. ప్రవేటు సంస్థల  భాగస్వామ్యంతో  ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేసే విషయంలో వ్యతిరేకించిన వైసీపీ ఇప్పుడు నేరుగా వేలాది ఎకరాలను విక్రయించేందుకు ముందుకెళ్ళడం ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తుంది. ఇటువంటి సంస్కృతి ఏ రాష్ట్రంలోనూ చూసిన దాఖలాలు లేవనే వాధనలు వినిపిస్తున్నాయి.