Konaseema: కోనసీమ.. ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు, చరిత్ర ఉంది. అటువంటి ప్రాంతం విషయంలో ప్రజల మనోభావలు పట్టించుకోకుండా వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఇంత పెద్ద దుమారానికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతలా ఉద్యమం, ఆగ్రహ జ్వాలలు ఎగసిపడతాయని ప్రభుత్వం ఊహించలేదు. ప్రభుత్వం అగ్గిరాజేసే కుట్రగా అభివర్ణిస్తున్న తరుణంలో ఇది రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉంది. ఒక వేళ కుట్ర కోణం ఉందన్న ప్రభుత్వం ఆ దిశగా దర్యాప్తు ముమ్మరం చేయాలి. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించాల్సిన అవసరముంది. ఇంతటి విధ్వంసానికి దిగిన నిందితులు.. దాడులకు పాల్పడిన వారు.. వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెట్టిన వారు ఎవరో వీడియో రికార్డుల్లో స్పష్టంగా ఉంది. వారెవరో సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా బయటవారు ఎవరూ రాలేదని చెబుతున్నారు. అంటే.. దాడులకు పాల్పడిన వారు ఎవరు.. వారిని ప్రోత్సహించిన వారు ఎవరు అన్నది అందరికీ స్పష్టంగా తెలుసు. మరి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు ? వారిని పట్టుకుంటారా లేక యథాప్రకారం రాజకీయం చేసి మసి పూసి మారేడుకాయ చేసి నిందితుల్ని వెనకేసుకొస్తారా ? అన్నది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

అస్పష్ట ప్రకటన..
అయితే ప్రజల మనోభావాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నామా? అని వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు మననం చేసుకోవాల్సిన సమయమిది. కానీ అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఓ వైపు అల్లర్లు జరుగుతూ ఉండగానే .. జనసేన, టీడీపీ నేతలే ఈ అల్లర్ల వెనుక ఉన్నారని హోంమంత్రి ప్రకటన చేయడం డొల్లతనాన్ని తెలియజేస్తోంది.
Also Read: CM Jagan: వినేవారు విదేశీయులని.. ఏపీలో ఆరోగ్య పరిస్థితులపై గొప్పగా చెప్పిన జగన్
ఏదో ఒకటి అనాలన్న ఆలోచనే తప్ప.. దీనిపై పూర్తిస్థాయిలో సమీక్షించి.. పోలీస్ అధికారుల నుంచి కేసు వివరాలు తెలుసుకొని అప్పుడు హోం మంత్రి నోరు విప్పాలి. కానీ అవేవీ చేయకుండా మీడియాకు విపక్షాలపై ఆరోపణలు చేస్తూ స్టేట్‌మెంట్లు ఇవ్వడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. సరే గతంలో హోంమంత్రి ఉన్నా అదే చేసేవారనుకున్నా.. అసలు చేయాల్సిన పని చేయాలి కదా. ! నిందితుల్ని అరెస్ట్ చేయాలి కదా ! ఎవర్నీ వదిలి పెట్టబోమని గంభీరంగా ప్రకటనలు చేశారు. చివరికి బాధితుడైన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కూడా అదే్ చెప్పారు. కానీ నిందితుల్ని ఇప్పటి వరకూ గుర్తించను కూడా లేదు. కుట్ర కోణం దాగి ఉందని అనుకుంటున్న తరుణంలో కేసు విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది.

కుట్ర కోణమేనా?
అయితే ఆ విషయంలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. దాడులకు పాల్పడిన వారెవరో.. ఫోటోలు వీడియోలతో సహా సోషల్ మీడియాలో దర్శనం ఇస్తున్నారు. వారంతా మంత్రి విశ్వరూప్ అనుచరులేనని చెబుతున్నా రు. ఆయన అనుచరులు ఆయన ఇంటిపైనే దాడికి పాల్పడటం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్. ఇదంతా రాజకీయ కుట్ర అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అదే నిజం అయితే పోలీసులు నిందితుల్ని కాకుండా ఇతరుల్ని అరెస్ట్ చేసి రాజకీయం చేయడం ఖాయమే. ఒక వేళ వైసీపీ నేతలే దుశ్చర్యలకు పాల్పడి టీడీపీ, జనసేన వైపు నెట్టడం కూడా అనుమానాలకు తావిస్తోంది. అమలాపురం ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకున్న సందేశాలు పంపకపోతే.. అల్లరి మూకలు.. ధైర్యంతో మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది. దీనిని కఠినంగా నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. లేకుంటే ఉన్మాద శక్తులు మరింతగా రెచ్చిపోయే అవకాశముంది.
Also Read:Pawan Kalyan : కోనసీమ ఉద్రిక్తతలకు కారణం వారే.. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Recommended videos



[…] Also Read: Konaseema: ‘కోనసీమ’ నిందితులెవరో తెలుసు.. యా… […]
[…] Also Read: Konaseema: ‘కోనసీమ’ నిందితులెవరో తెలుసు.. యా… […]