Homeఎంటర్టైన్మెంట్Dil Raju: 'ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ'లతో పాన్ వరల్డ్ సినిమాలు !

Dil Raju: ‘ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ’లతో పాన్ వరల్డ్ సినిమాలు !

Dil Raju: ‘దిల్ రాజు’ సక్సెస్ సీక్రెట్ వెనుక కారణం ఒక్కటే.. టాలెంట్ ఉన్న వాళ్ళను వెతికి పట్టుకోవడం. అలాగే, ఫామ్ లో ఉన్న హీరోలతో భారీ సినిమాలు చేయడం. అందుకే, పక్క నిర్మాతల చూపు ఎప్పుడు దిల్ రాజు కాంపౌండ్ వైపే ఉంటుంది. దిల్ రాజు ఇప్పుడు ఏమి ప్లాన్ చేస్తున్నాడా ? అంటూ ఎప్పటికప్పుడు ఎంక్వైరీలు చేస్తుంటారు మిగిలిన నిర్మాతలు. తాజాగా దిల్ రాజు ప్లాన్ చేస్తున్న సినిమాల లైనప్ చూస్తుంటే మతిపోతుంది.

Dil Raju
Dil Raju

తెలుగు టాప్ హీరోలతో ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఎన్టీఆర్‌ కోసం ఓ కథ సిద్ధం చేయిస్తున్నాడు. కొరటాల, ప్రశాంత్ నీల్ సినిమాల తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా దిల్ రాజు బ్యానర్ లోనే. దిల్ రాజు కూడా ఈ విషయం గురించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభాస్‌ తో కూడా దిల్ రాజు మరో పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రభాస్‌ కోసం కూడా కథ రెడీ చేయిస్తున్నాడు.

Also Read: F3 Venkatesh Remuneration: షాకింగ్.. F3 కోసం వెంకటేష్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

మరి ప్రభాస్ సినిమా తర్వాత, రాజు ఎవరితో సినిమా ప్లాన్ చేస్తున్నాడో తెలుసా? అల్లు అర్జున్‌ తో. ఈ సినిమా ప్లానింగ్ కూడా అయ్యిపోయింది. బన్నీతో ఐకాన్ అనే పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. మొత్తానికి ఇలా తెలుగులో టాప్ హీరోలందరికి కథలను సిద్దం చేస్తూ.. దిల్ రాజు ఎవరికీ అందనంత ఎత్తులో ఆలోచిస్తున్నాడు. ప్రస్తుతం చరణ్ – శంకర్ కలయికలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.

Dil Raju
prabhas, ntr, ram charan, allu arjun

సినిమా పరిశ్రమలో చోటు చేసుకొన్న ఒడిదుడుకులను తట్టుకొని నిలబడుతూ మొత్తానికి దిల్ రాజు తనదైన భారీ తనం చూపిస్తున్నాడు. మార్వెల్, సూపర్ హీరోస్ వంటి సినిమాలు తెలుగు హీరోల పై కూడా తీయాలని దిల్ రాజుకి ఆశ ఉందట. మొత్తానికి అలా చేస్తే.. ఆ సినిమా అద్భుత రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం. ఏది ఏమైనా టాలీవుడ్‌లో కూడా లార్జర్ ద్యాన్ లైఫ్ సినిమాలకు రాజమౌళి మార్గదర్శకంగా నిలుస్తూ వస్తున్నారు.

పైగా తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికే సరైన గౌరవం తెచ్చిన వ్యక్తి గా ‘దిల్ రాజు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా తక్కువ సమయంలోనే ‘దిల్ రాజు’ తిరుగులేని నిర్మాతగా ఎదిగారు.

Also Read:Bindu Madhavi Prize Money: బిగ్ బాస్ లో పాల్గొని బిందుమాధవి సొంతం చేసుకున్న మొత్తం ఫ్రైజ్ మనీ ఎంతో తెలుసా?
Recommended videos
Vijay Devarakonda Shocking Behaviour With Ananya Panday || Charmy Kaur || Oktelugu Entertainment
Samantha And Vijay Devarakonda Latest Visuals || Kushi Movie Wrap-Up Party || Oktelugu Entertainment
అప్పుడు పవన్ ఇప్పుడు అకిరా || Akira Participate In Green India Challenge || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version