Alliance Politics In AP: ఏపీలో పొత్తు రాజకీయం.. బీజేపీ లెక్కేమిటి?

Alliance Politics In AP: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండి. కానీ అప్పుడే రాజకీయ హీట్ ప్రారంభమైంది. పొత్తుల అంశం తెరపైకి రావడమే ఇందుకు కారణం. సాధారణంగా ఎన్నికల వేళ పొత్తు అనేది తెరపైకి వస్తోంది. కానీ ఏపీలో మాత్రం రెండేళ్ల ముందు నుంచే పొత్తు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రకటనలతో వేడెక్కిస్తున్నారు. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చిలనివ్వనని పవన్ కళ్యాణ్ ప్రకటనల […]

Written By: Dharma, Updated On : May 10, 2022 4:03 pm
Follow us on

Alliance Politics In AP: ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల వ్యవధి ఉండి. కానీ అప్పుడే రాజకీయ హీట్ ప్రారంభమైంది. పొత్తుల అంశం తెరపైకి రావడమే ఇందుకు కారణం. సాధారణంగా ఎన్నికల వేళ పొత్తు అనేది తెరపైకి వస్తోంది. కానీ ఏపీలో మాత్రం రెండేళ్ల ముందు నుంచే పొత్తు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రకటనలతో వేడెక్కిస్తున్నారు. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చిలనివ్వనని పవన్ కళ్యాణ్ ప్రకటనల తరువాత పొత్తుల రాజకీయాలు శరవేగంగా మారిపోయాయి. ఇది సహజంగా అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు. .జనసేన, బీజేపీ కూటమి, టీడీపీ వేర్వేరుగా పోటీచేస్తే తమకు లాభిస్తుందన్నది వైసీపీ వ్యూహం. అటు ఇప్పటివరకూ మైత్రి కొనసాగిస్తున్న జనసేన టీడీపీతో కలవడం బీజేపీకి ఇష్టం లేదు. టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కలిసి వస్తుందన్న నమ్మకాన్ని పవన్ వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అద్భుతం జరగబోతుందని చెబుతున్నారు. టీడీపీ,జనసేన అలయెన్స్ లోకి బీజేపీ వస్తుందన్నదే అద్బుతంగా అటు జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. మరోవైపు ఒంటరిగా ఎన్నికల్లో దిగాలని పవన్, చంద్రబాబులకు వైసీపీ శ్రేణులు సవాల్ విసురుతున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో మాత్రం పార్టీల విరుద్ధ ప్రకటనలతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

chandrababu, somu veerraju, pawan kalyan

గత పరిస్థితులు లేవు..

2019 ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగిన వైసీపీ భారీ మెజార్టీని సొంతం చేసుకుంది. విపక్షాలు ఎవరికి వారుగా పోటీచేయడంతో రికార్డు విజయం సొంతమైంది. 2024 ఎన్నికల్లో కూడా అదే తరహాలో గెలుపొందాలని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. కానీ గత సారి ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్లో తనను విభేదించిన టీడీపీని దెబ్బతీయడానికి పొరుగు రాష్ట్రంలోని కేసీఆర్ తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. కొన్ని వ్యవస్థల ద్వారా వైసీపీకి సహకరించింది. మరోవైపు జనసేన విడిగా పోటీచేసింది. ప్రతీ నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లు చీల్చగలిగింది. అంతిమంగా ఇది వైసీపీకి లాభించింది. ఈ సారి బీజేపీ ఒక వేళ టీడీపీ,జనసేన వైపు వెళితే తీరని నష్టం జరుగుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో అలయెన్స్ ఉండకూడదని భావిస్తున్నారు. ఎలాగైనా విఛ్చిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే టీడీపీ, జనసేన అధినేతలు పరస్పరం పొత్తు అనుకూల ప్రకటనలు ఇస్తున్నా.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మాత్రం అందుకు విరుద్ధమైన ప్రకటనలు చేస్తోంది. జనసేనతో మైత్రి వరకూ బాగానే వ్యాఖ్యానిస్తున్నా.. చంద్రబాబు అనేసరికి మాత్రం ఖండిస్తున్నారు.

Also Read: TDP Looking For Alliances: పొత్తుల కోసం టీడీపీ ఆరాటంలో అర్థముందా?

తీవ్ర ప్రజా వ్యతిరేకత..

వాస్తవానికి వైసీపీ సర్కారు పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అన్నివర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత మూటగట్టుకుంది. సంక్షేమ పథకాల మాటున గెలవాలని ప్రయత్నిస్తున్నా గ్రౌండ్ లెవల్ లో మాత్రం పార్టీ పట్టుసడలింది. ఉద్యోగ, ఉపాద్యాయులు వ్యతిరేకంగా ఉన్నారు. జాబ్ కేలండర్ అమలు చేయకపోవడంతో నిరుద్యోగ యువత గుర్రుగా ఉన్నారు. నిత్యావసరాల ధరలు నియంత్రణలో లేవు. రాజధాని లేదు. అభివ్రద్ధి పనుల జాడలేదు. ఈ పరిస్థితుల్లో రాజకీయ వ్యూహాత్మకంగా వెళితే తప్ప ప్రయోజనం లేదన్న భావనకు వైసీపీ అధినేత వచ్చారు. అందుకే కేంద్ర పెద్దలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాజకీయంగా గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నారు. వైసీపీ సర్కారును గద్దె దించాలని రాష్ట్రంలో విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ఒక వేళ బీజేపీ కానీ జట్టు కడితే జగన్ కు కష్టమే.

చంద్రబాబుతో కలవని బీజేపీ..

bjp, tdp, jana sena

అయితే తమకు రాజకీయంగా లాభించకపోయిన పర్వాలేదు కానీ చంద్రబాబుతో కలవమని బీజేపీ రాష్ట్ర నాయకత్వం తేల్చిచెబుతోంది. త్యాగాలకు సిద్ధంగా ఉండాలని సొంత పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చిన క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ త్యాగాలు మాకొద్దంటూ పొత్తు అవసరం లేదనే విషయాన్ని బహిరంగంగానే వెల్లడించారు. దీని వెనుక గత అనుభవాలే కారణంగా తెలుస్తోంది. ఇదివరకే టీడీపీతో పొత్తు పెట్టుకోవడం, అది కాస్తా మూణ్ణాళ్ల ముచ్చటగా మారడం.., ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు… బీజేపీ జాతీయ నాయకత్వం, ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సోము వీర్రాజు.. జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని… ప్రస్తుతం రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయన్నారు. కాకపోతే టీడీపీతో పొత్తు విషయాన్ని పవన్ కల్యాణ్ నే అడగాలని బాల్ ని పవన్ కోర్టులోకి నెట్టారు. దీంతో టీడీపీకి తాము ఎప్పటికీ సమాన దూరం పాటిస్తామనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు కాబట్టి బీజేపీ కేంద్ర నాయకత్వంతో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉండటం, జనసేనాని సైతం పొత్తుకు సై అంటుడటం చూస్తుంటే భవిష్యత్తులో పొత్తు పొడిచే అవకాశాలు లేకపోలేదు.

వైసీపీకి పొత్తు భయం

ఈ మొత్తం ఎపిసోడ్ ను అలా ఉంచితే మరోవైపు వైసీపీకి పొత్తు భయం పట్టుకుంది. ఓ వైపు సంక్షేమం పేరుతో నేరుగా జనాలకు డబ్బులు పంచుతున్నా.., ఎక్కడో వారిలో చిన్న అసంతృప్తి ఉందనే విషయాన్ని పార్టీ అధినాయకత్వం గుర్తించింది. దీనికి తోడు రాష్ట్రంలో పొత్తు రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటుండం అధికార పార్టీకి మింగుడుపడటం లేదు. ఓ వైపు సింగిల్ గా పోటీ చేసే దమ్ములేదంటూ ప్రతిపక్ష పార్టీలను రెచ్చగొడుతూనే.., టీడీపీ, జనసేన, బీజేపీ ఎక్కడ జతకట్టి ఎన్నికల యుద్ధం ప్రకటిస్తాయోనని ఆ పార్టీ కొంత మీమాంసలో పండింది. ఏదేమైనా ఈ పొత్తు రాజకీయాలు ఓ మలుపు తీసుకోవాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!

Also Read:Cyclone Alert In AP: ఏపీకి హైఅలర్ట్.. తీవ్ర తుఫాను హెచ్చరిక

Tags