టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?

డాక్టర్స్ డే సందర్భంగా నిన్న 108, 104 సర్వీసులకు సంబంధించిన 1088 కొత్త ఆంబులెన్స్ వాహనాలను విజయవాడ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మనిషి ప్రాధమిక అవసరాలలో ముఖ్యమైన వైద్యం విషయంలో జగన్ వేసిన ముందడుగుకు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అయ్యింది. పలు జాతీయ మీడియా సంస్థలు ఈ వార్తను ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాలు ప్రజల ప్రాణాలను కాపాడంతో పాటు, మెరుగైన సేవలు అందిస్తాయని అందరూ […]

Written By: Neelambaram, Updated On : July 2, 2020 12:16 pm
Follow us on


డాక్టర్స్ డే సందర్భంగా నిన్న 108, 104 సర్వీసులకు సంబంధించిన 1088 కొత్త ఆంబులెన్స్ వాహనాలను విజయవాడ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. మనిషి ప్రాధమిక అవసరాలలో ముఖ్యమైన వైద్యం విషయంలో జగన్ వేసిన ముందడుగుకు దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అయ్యింది. పలు జాతీయ మీడియా సంస్థలు ఈ వార్తను ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది. అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన ఈ వాహనాలు ప్రజల ప్రాణాలను కాపాడంతో పాటు, మెరుగైన సేవలు అందిస్తాయని అందరూ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

జగన్ ఇమేజ్ ని పెంచే ఏ విషయమైనా ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి నచ్చని అంశమే. దీనితో 108, 104 వాహనాల ప్రారంభానికి వారు అవినీతి మరక అంటించారు. వైసీపీ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆంబులెన్స్ల కొనుగోళ్లు విషయంలో భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు జరిపి తన బంధువులకు భారీగా లబ్ది చేకూర్చారు అని ఆరోపిస్తున్నారు. ఆంబులెన్సుల కొనుగోళ్ళకు వ్యవహారంలో 300 కోట్ల అవినీతి జరిగింది అనేది టీడీపీ నాయకుల వాదన.

ఐతే ఇక్కడ మనం గమనించాల్సింది, కొత్త ఆంబులెన్సు వాహనాల కొనుగోలు మరియు ఆధునికీకరణకు ప్రభుత్వం ఖర్చు చేసింది రూ. 201 కోట్లు మాత్రమే అని ప్రకటించడం జరిగింది. రూ. 201 కోట్ల ప్రాజెక్ట్ లో రూ. 300 కోట్ల అవినీతి ఎలా జరిగింది అనేది..అర్థం కానీ ఆరోపణ. ఒక వేళ ఇది మొత్తంగా రూ. 500 కోట్ల ప్రాజెక్ట్ అయినప్పటికీ రూ. 300 కోట్ల మేర అవినీతి జరిగే అవకాశం లేదు. అసలుకు మించిన అవినీతి ఎలా సాధ్యం అవుతుంది. అలా జరగాలంటే రోడ్లపైకి వచ్చిన ఆంబులెన్సుల గ్రాఫిక్స్ బొమ్మలు అయ్యుండాలి…లేదా ఇంజను లేని డమ్మీ వాహనాలు అయ్యుండాలి.

ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

మరో వైపు డాక్టర్స్ డే సంధర్భంగా పురస్కరించుకొని ప్రారంభించిన ఈ కార్యక్రమానికి విజయ సాయి రెడ్డి బర్త్ డే ట్యాగ్ వాడుతున్నారు. ఓ వారం రోజులు క్రితం శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ బారినపడి మరణించిన వృద్ధుడి శవాన్ని జేసీబీ లో తరలించడానికి కారణం అంబులెన్సులు ప్రచార ఆర్భాటం కోసం విజయవాడ తరలించడమే అని ఆరోపిస్తున్నారు. ఇది ఒక వేళ నిజం అనుకున్నా…గోదావరి పుష్కరాలలో బాబు ప్రచార ఆర్భాటం వలన మరణించిన 24 మంది అమాయకుల ప్రాణాలతో పోల్చితే శవాన్ని జేసీబీ లో తరలించడం… ఏపాటి అన్యాయంతో కూడిన ఆర్బాటమో టీడీపీ నాయకులు సెలవిస్తే మంచిది.