Small Screen Movies: పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఇండస్ట్రీలోనూ అతిపెద్ద సందడి నెలకొంటుంది. మాస్ యాక్షన్ తో అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పించే పవన్ సినీ కలెక్షన్లలోనూ తన మార్క్ చూపిస్తాడు. ఆయన నటించిన ‘బీమ్లానాయక్’ థియేటర్లో ఎంత రచ్చ చేసిందో చూశాం. మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించింది. ఆయితే వారం రోజుల తరువాత ఈ టార్గెట్ తగ్గిపోయింది. దీంతో బీమ్లానాయక్ ను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా థియేటర్లో సందడి చేసిన భీమ్లానాయక్ టీవీల్లో మాత్రం అంచనాలు అందుకోలేకోయింది. అంతేకాకుండా భీమ్లానాయక్ తరువాత వచ్చిన డీజే టిల్లు కంటే తక్కువ టీఆర్పీ నమోదు చేసుకోవడం గమనార్హం.
పవన్ రీ ఎంట్రీ తరువాత తీసిన సినిమాల్లో భీమ్లానాయక్ మూడోది. వరుసగా మూడో సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. సాగర్ కే చంద్ర డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే వహించారు. సినిమాకు అంతా తానై అన్నట్లుగా వ్యవహరించారు. మలయాళం మూవీ రీమేక్ అయిన భీమ్లానాయక్ తెలుగు నేటివిటికి తగ్గట్టుగా తీర్చి దిద్దారు. ఇందులో పవన్ తో పాటు రానా కూడా నటించారు. అయితే ఈ సినిమా థియేటర్లో రిలీజ్ రోజు నుంచే జోష్ మొదలైంది. రికార్డుల కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోయింది. కానీ నాన్ థియేట్రికల్ విషయానికొచ్చేసరికి బోల్తాపడింది.
Also Read: Bullet Bhaskar Dubbing Mahesh Babu: మహేష్ సినిమాకు ఆ జబర్ధస్త్ కమెడియన్ డబ్బింగ్ చెప్పాడు?
భీమ్లానాయక్ నాన్ థియేట్రికల్ హక్కుల్లో భాగంగా శాటిలైట్ ను స్టార్ మా సొంతం చేసుకుంది. ఓటీటీ విషయానికొస్తే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. గత ఆదివారం స్టార్ మాలో ప్రసారమైన భీమ్లానాయక్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ అందుకు భిన్నమైన రిజల్ట్స్ వచ్చాయి. పవన్ తో పాటు మరో స్టార్ హీరో రానా కూడా నటించడంతో ఈ మూవీపై మొదటి నుంచి భారీగానే అంచనాలున్నాయి. అందుకు తగ్గట్లుగా థియేట్రికల్లో లాభాలు వచ్చాయి. కానీ టీవీ విషయానికొచ్చేసరికి తారుమారయ్యాయి.
ఇదే సమయంలో టీవీ ప్రసారమైన డీజె టిల్లు అంచనాలు మించిపోయింది. భీమ్లానాయక్ కంటే ఎక్కువగా టీఆర్పీ రేటు సాధించడం విశేషం. భీమ్లానాయక్ టెలివిజన్ టీఆర్పీ రేట్ 9.06 వచ్చింది. అదే డీజే టిల్లుకు 10.03 రావడం విశేషం. డీజే టిల్లు మొదటిసారి ప్రసారమైన ఇంతటి టీఆర్పీ రేటు రావడంపై సర్వత్రా చర్చ సాగుతోంది. చాలా సినిమాలు థియేటర్లో బోల్తా పడ్డా.. టీవీల విషయానికొచ్చేసరికి సక్సెస్ అవుతాయి. కానీ భీమ్లానాయక్ విషయంలో ఇలా జరిగేసరికి రకరకాలుగా చర్చించుకుంటున్నారు.