
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తీసుకొచ్చిన కొత్త ప్రైవేట్ యాప్ పై జగన్ సర్కార్ సీరియస్ అయ్యింది. ఎన్నికల నిర్వహణకు ఎవరి సలహా తీసుకోకుండా.. ప్రభుత్వంతో సంబంధం లేకుండా దూకుడుగా.. దురుసుగా.. యాప్ ను నిమ్మగడ్డ ఆవిష్కరించాడు. ఎన్నికల్లో పారదర్శకతకు అంటూ టీడీపీకి ఫేవర్ చేసేందుకే ఈ యాప్ తెస్తున్నాడని వైసీపీ సర్కార్ ఆరోపిస్తోంది. ఎన్నికల పర్యవేక్షణ పేరుతో గుట్టు చప్పుడుకాకుండా యాప్ రూపొందించి, భద్రతాపరమైన అనుమతులు తీసుకోకుండానే వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన ఆ యాప్ ను బుధవారం అంటే నేడు ఉదయం 11గంటలకు ఆవిష్కరించనున్నట్లు.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా వెల్లడించారు.
Also Read: ఏపీలో విద్యుత్ కొనుగోళ్లలో భారీ స్కాం..?
అయితే ఈ యాప్ తయారీ మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. అసలు యాప్ తయారు చేసింది ఎవరు..? కంట్రోల్ కేంద్రం ఎక్కడుంది.. ఎవరు పర్యవేక్షిస్తారు..? సిబ్బంది ఎవరు.. ఫిర్యాదులను ఎలా పరిష్కరిస్తారు.. తదితర వివరాలు బహిర్గతం కాకుండా గోప్యత పాటించడం అనేక అనుమనాలకు తావిస్తోంది. పూర్తి పారదర్శకతతో జరగాల్సిన ఎన్నికలకు వినియోగించే యాప్ ను అనుమతులు లేకుండానే ఆవిష్కరించేందుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిద్ధమవ్వడం గమనార్హం. ఈ యాప్ లో అందే సమాచారాన్ని ముందు తాను చూసి.. తరువాత ఎంపిక చేసిన డేటానే కలెక్టర్లకు పంపేలా.. ఇప్పటికే నిమ్మగడ్డ ఏర్పాట్లు చేసుకున్నట్టు ప్రభుత్వం ఆరోపిస్తోంది.
సాధారణంగా ప్రభుత్వంలో ఏ సాంకేతిక అంశాన్నయినా వినియోగించేముందు అనుమతి తప్పనిసరి.. అందులో యాప్ లు.. ఇతర సాఫ్ట్ వేర్లు.. వినియోగించాలంటే.. నిబంధనలు తప్పనిసరి. యాప్ లో నమోదు చేసే సమాచారం నిర్ణీత వ్యక్తులు వినహా.. ఇతరులకు చేరకుండా.. హ్యాక్ చేసే వీలు లేకుండా డేటా సెక్యూరిటీ ఏర్పాట్లు ఉన్నయా..? అని ఏపీటీఎస్ నిపుణులు పరిశీలన చేయాలి. తరువాత అనుమతులు మంజూరు చేయాల్సి ఉంటుంది. యాపులో నమోదు చేసే సమాచారాన్ని బయటి వ్యక్తులు దొంగలించకుండా.. ప్రభుత్వం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే డేటా భద్రతకు ఉద్దేశించిన అనుమతులేవీ తీసుకోకుండా.. యాప్ ను ప్రవేశపెట్టేందుకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సిద్ధమయ్యరు.
Also Read: ఎస్‌ఈసీపై సభా హక్కుల ఉల్కంఘన చర్యలు సాధ్యమేనా..?
ఎన్నికల కోసం ఇప్పటికే పంచాయతీరాజ్ తయారు చేయించిన యాప్ ఉన్నప్పటికీ.. దాన్ని కాదని.. అనుమతులు లేని.. ప్రై వేటు యాప్ ను ఎన్నికల పర్యవేక్షణకు వినియోగించాలని ఎస్ఈసీ రమేశ్ కుమార్ తీసుకున్న నిర్ణయం వెనక టీడీపీకి లబ్ధి చేకూరేలా దురుద్ధేశం చేశారని పలువురు రాజకీయ వేత్తలు అంటున్నారు. కొందరు పచ్చపార్టీ ముఖ్యనేతలు హైదరాబాద్ నుంచి పర్యవేక్షించేలా యాప లో ఏర్పాట్లు జరినట్లు ఎన్నికల కమిషనర్ కార్యాలయ వర్గాల్లోనే చాలా మందికి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో రాజకీయాల ప్రవేశం ద్వారా.. ప్రశాంతతకు భంగం కలగనుంది. బుధవారం 11 గంటలకు నిమ్మగడ్డ తయారు చేసిన యాపును విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు సమాచారం.
ప్రభుత్వాన్ని సంప్రదించకుండా.. అనుమతి లేకుండా యాప్ తయారు చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కు మరోసారి ఏపీ సర్కార్ షాకిచ్చింది. ఎస్ఈసీ తీసుకొచ్చిన ఈ-వాచ్ యాప్ పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం లాంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిని పరిశీలించిన కోర్టు లంచ్ మోహన్ కు నిరాకరించి గురువారం విచారణ జరుపుతామని తెలిపింది.ఈ-వాచ్ యాప్ పూర్తి ప్రైవేట్ యాప్ అని.. ఎస్ఈసీ ఇంతకుముందు వాడే యాప్ స్థానంలో కొత్త యాప్ వాడుతున్నారని ప్రభుత్వం పిటీషన్ లో ప్రస్తావించింది. యాప్ ను నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం కోరింది. దీంతో మరోసారి నిమ్మగడ్డ, జగన్ సర్కార్ మధ్య కొత్త యాప్ చిచ్చు పెట్టినట్టైంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్