Alla Ramakrishna Reddy vs Lokesh: ఏపీలో ఇప్పుడు అందరి చూపు మంగళగిరి నియోజకవర్గంపై పడింది. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిన నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. ఆళ్ల రామక్రిష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి నియోజకవర్గంపై పట్టు పెంచుకునేందుకు నారా లోకేష్ చేయని ప్రయత్నమూ లేదు. ఎంపీటీసీ ఎన్నికల్లో గట్టి ప్రయత్నమే చేసిన లోకేష్ మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను గెలిపించుకున్నారు. ముఖ్యంగా దుగ్గిరాల మండలం ఎంపీపీని గెలుచుకునేందుకు తగ్గ సంఖ్యా బలాన్ని దక్కించుకున్నారు. అక్కడ జనసేన అభ్యర్థి ఒకరు గెలుపొందారు.

ఆయన కూడా టీడీపీకి సపోర్టుగా నిలిచారు. ఇక టీడీపీ అభ్యర్థి ఎంపీపీగా గెలవడం లాంఛనమే అనుకున్నారు. అయితే నియోజకవర్గంలో పట్టు సడలకూడదని భావించిన వైసీపీ అధిష్ఠానం ఎట్టి పరిస్థితుల్లో దుగ్గిరాల ఎంపీపీ పదవి వదులుకోకూడదని డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ముందుగా టీడీపీ ఎంపీపీ అభ్యర్థి అయిన జబీన్ రిజర్వేషన్ ను తెరపైకి తెచ్చారు. బీసీ రిజర్వేషన్ పై పోటీచేసిన ఆయన అసలు బీసీయే కాదంటూ అప్పటి కలెక్టర్ వివేక్ యాదవ్ ధ్రువీకరిస్తూ కోర్టుకు తెలియజేశారు.
Also Read: TV9 vs Vishwak Sen: విశ్వక్ సేన్ వర్సెస్ టీవీ9.. ట్రోలింగ్ వీడియోలతో పండుగ చేసుకుంటున్న నెటిజన్లు
దీనికి తగ్గట్టుగానే టీడీపీ కూడా వ్యూహం మార్చింది. వైసీపీలో అసంత్రుప్త ఎంపీటీసీలపై ద్రుష్టిపెట్టింది. అందులో భాగంగా వైసీపీ రెబల్ గా అదే పార్టీ ఎంపీటీసీ పద్మావతిని తెరపైకి తెచ్చింది. టీడీపీ సభ్యులతో పాటు జనసేన ఎంపీటీసీ మద్దతు పద్మావతికి తెలిపేందుకు అంగీకారం కుదిరింది. ఈ పరిణామంతో వైసీపీలో ఒక్కసారిగా అయోమయం నెలకొంది. ఎలాగైనా ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకు వైసీపీ రెబల్ ఎంపీటీసీ పద్మావతిని ఎంపీపీ ఓటింగ్ కు గైర్హాజరయ్యేలా వ్యూహం పన్నింది. గురువారం ఎన్నికలనగా.. బుధవారం ఆమె కనిపించకుండా పోయింది. ఆమెను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్టారెడ్డి కిడ్నాప్ చేయించారని పద్మావతి కుమారుడు మీడియా ముందుకు వచ్చి తీవ్ర విమర్శలు చేశారు. పద్మాతికి ఏమైనా జరిగితే అందుకు ఎమ్మెల్యే రామక్రిష్ణా రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

జాగ్రత్త పడిన టీడీపీ
తాజా పరిణామాలతో టీడీపీ జాగ్రత్త పడింది. లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ , జనసేన ఎంపీటీసీలు అందరూ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో క్యాంప్‌లో ఉన్నారు. అందరికీ రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘం పోలీసుల్ని ఆదేశించింది. అయితే పోలీసుల్ని నమ్మలేని పరిస్థితి ఉండటంతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి నేరుగా దుగ్గిరాల ఎంపీపీ కార్యాలయానికి ఎంపీటీసీల్ని తరలించాలని నిర్ణయించుకున్నారు. దీంతో మంగళగిరిలో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి మరీ. వాస్తవానికి గత ఎన్నికల్లో అప్పటి సీఎం తనయుడు, తాజా మాజీ మంత్రి లోకేష్ ను మంగళగిరి ప్రజలు ఓడించారు. అటు తరువాత రాజధాని తరలింపుతో వైసీపీ పట్ల స్థానికులు వ్యతిరేకత కనబరుస్తూ వస్తున్నారు. అందుకే ఎంపీటీసీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను టీడీపీ, జనసేనలకు కట్టబెట్టారు. కానీ రాజధాని ప్రాంతంలో ఎంపీపీ పదవిని వదులుకుంటే విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారుతుందని భావించి పట్టు నిలుపుకునేందుకు వైసీపీ తెగ ప్రయత్నాలు చేస్తోంది.
Also Read:MLC Kavitha: ఓడిన చోటే పోటీ.. నిజామాబాద్ పైనే కవిత గురి.. కారణమిదీ!
[…] Also Read: Alla Ramakrishna Reddy vs Lokesh: అందరి చూపు మంగళగిరి వైపే… […]