Abdullapurmet Assassination Case: వివాహేతర సంబంధాలు ప్రాణాల మీదికి తెస్తున్నాయి. జీవిత భాగస్వామి తప్పు చేయడంతో తల్లడిల్లుతున్న భార్య లేదా భర్తలు చివరకు తమ వారినే కడతేర్చుతున్నారు. తీరు మార్చుకోవాలని చెబుతున్నా పట్టించుకోకపోవడంతో వారి ప్రాణాలే తీస్తున్నారు. తమ కళ్ల ముందే ప్రియుడితో సరసాలు సాగిస్తున్న ప్రియురాలును కసితీరా చంపుతున్నారు.దీంతో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్న నేపథ్యంలో జీవిత భాగస్వామినే కడతేర్చుతున్నారు. నూరేళ్లు కలిసుంటానని ప్రమాణం చేసిన చేతితోనే హత్యలు చేస్తున్నారు.

హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో జంట హత్యలు సంచలన సృష్టించాయి. దీంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరి హత్యకు కారణాలేంటని ఆరా తీస్తున్నారు. హత్యకు గురైన ఎడ్ల యశ్వంత్ (22), వివాహిత జ్యోతి (30) మృతదేహాల దగ్గర దొరికిన ఆధారాలన బట్టి విచారణ చేపట్టారు. జంట హత్యలను చేసింది జ్యతి భర్త శ్రీనివాస రావే అని తేల్చారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Alla Ramakrishna Reddy vs Lokesh: అందరి చూపు మంగళగిరి వైపే.. ఆళ్ల వర్సెస్ లోకేష్..
జ్యోతి, యశ్వంత్ ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. కొద్ది కాలంగా ఇద్దరు కలుసుకుంటున్నారు. దీంతో అనుమానం వచ్చిన భర్త శ్రీనివాస రావు పలు మార్లు హెచ్చరించాడు. తన ప్రవర్తన మార్చుకోవాలని హితవు పలికాడు. అయినా వారి ప్రవర్తనలో మార్పు కనిపించలేదు. ఇక వారిని హత్య చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో తాను ఇంటికి రావడం లేదని ఊరు వెళ్తున్నానని ఇంటికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో జ్యోతి, యశ్వంత్ బయటకు వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు.

దీంతో జ్యోతి, యశ్వంత్ కలిసి ద్విచక్రవాహనంపై వారాసిగూడ నుంచి వెళ్తుండగా శ్రీనివాస రావు వారిని 30 కిలోమీటర్లు వెంబడించినట్లు తెలుస్తోంది. వారు అబ్దుల్లాపూర్ మెట్ దాటి కొత్తగూడెం వంతెన వద్ద జాతీయ రహదారిపై బైకు నిలిపి పాత రహదారిపై చేరుకున్నారు. ఇద్దరు ఏకాంతంగా ఉన్నారని గ్రహించిన శ్రీనివాస రావు బండరాయితో జ్యోతి తలపై బలంగా మోదడంతో మృతి చెందింది. అనంతరం యశ్వంత్ ను కూడా పదునైన ఆయుధంతో మర్మాంగానికి ఛిద్రం చేశాడు. కసితో ఇద్దరిని చంపి మళ్లీ జాతీయ రహదారిపైకి చేరుకున్నట్లు తెలుస్తోంది.
శ్రీనివాస రావుకు మరో ఇద్దరు సహకరించినట్లు సమాచారం. కానీ వార ఎవరనేది తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాల ఆధారంగా శ్రీనివాస రావు విజయవాడ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని అరెస్టు చేశారు. కానీ ఇంకా అతడి అరెస్టును పోలీసులు ధ్రువీకరించడం లేదు. విచారణ జరుగుతోందని వివరాలు త్వరల వెల్లడిస్తామని చెబుతున్నారు. మొత్తానికి వివాహేతర సంబంధాలు నిండు ప్రాణాలను తోడేస్తున్నాయి.
Also Read: TV9 vs Vishwak Sen: విశ్వక్ సేన్ వర్సెస్ టీవీ9.. ట్రోలింగ్ వీడియోలతో పండుగ చేసుకుంటున్న నెటిజన్లు