https://oktelugu.com/

Haryana Election Result 2024: అందరి దృష్టి హర్యానాపైనే.. ఆ ఆరుగురు గెలుస్తారా? సీఎం రేసులో ఎవరు ముందు?

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉత్కంఠ నెలకొంది. రౌండ్‌ రౌండ్‌కు ఫలితాలు మారుతున్నాయి. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌ భారీ ఆధిక్యం కనబర్చాగా.. రెండో రౌండ్‌లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : October 8, 2024 12:06 pm
    Haryana Election Result 2024

    Haryana Election Result 2024

    Follow us on

    Haryana Election Result 2024: హర్యానా అసెంబ్లీలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్‌ 5న పోలింగ్‌ జరిగింది. మంగళవారం(అక్టోబర్‌ 8న) ఫలితాలు వెల్లడి కానున్నాయి. పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి. బీజేపీ మాత్రం హ్యాట్రిక్‌పై ధీమాగా ఉంది. ఫలితాలు మాత్రం అందరి అంచనాలను తారుమారు చేస్తున్నాయి. రెండు రౌండ్ల కౌంటింగ్‌ తర్వాత మొదటి రౌండ్‌లో కాంగ్రెస్, రెండో రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం కనబర్చాయి. మొదటి రౌండ్‌ ఫలితాలు ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాల ప్రకారం వచ్చాయి. కానీ, రెండో రౌండ్‌లో బీజేపీ అనూహ్యంగా ఆధిక్యంలో వచ్చింది. ప్రస్తుతం బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. ఫలితాల ట్రెండ్స్‌ ఇలా కొనసాగుతుండగా.. అందరి దృష్టి ఆరుగురిపైనే ఉంది.

    భూపేంద్ర సింగ్‌ హుడా
    హార్యానా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత, ప్రస్తుత సీఎం అభ్యర్థి భూపేంద్రసింగ్‌ హుడా గుర్తి సంప్లాకిలోయ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ జీటుపై ఆయనకు గట్టి పట్టు ఉంది. హుడా రాస్ట్రానికి రెండుసార్లు సీఎంగా పనిచేశారు. కాంగ్రెస్‌కు మెజారిటీ వస్తే హుడా మరోమారు సీఎం అయ్యే అవకాశం ఉంది.

    నాయబ్‌ సింగ్‌ సైనీ
    హర్యానా ప్రస్తుత సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ. లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను మార్చి. సైనీని సీఎం చేసింది. ఆయన కురుక్షేత్రలోని లాడ్వా నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై కాంగ్రెస్‌ తరఫున మేవాసింగ్‌ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో మేవా సింగ్‌ లాడ్వా స్థానం నుంచి విజయం సాధించారు.

    అనిల్‌ విజ్‌
    ఇక హర్యానాలో బీజేపీలో కీలక నేతగా గుర్తింపు పొందారు అనిల్‌ విజ్‌. రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన విజ్‌ ప్రస్తుతం అంబాలా కాంట్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 1967 నుంచి 2019 అసెంబ్లీ ఎన్నికల వరకు పంజాబీ వర్గానికి చెందిన వారే విజయం సాధిస్తున్నారు.

    దుష్యంత్‌ చౌతాలా
    జేజేపీ నేత దుష్యంత్‌ చౌతాలా. మాజీ డిప్యూటీ సీఎం అయిన ఆయన ఉచానా స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఐదేళ్లు బీజేపీ ప్రభుత్వంతో జత కట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఉచానా స్థానం నుంచి దుష్యంత్‌ చౌతాలా గెలిచారు.

    వినేష్‌ ఫోగట్‌
    ఇక ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం చేజార్చుకున్న రెజ్లర్‌ వినేష్‌ ఫోగట్‌ రాజకీయాల్లోకి ప్రవేశించారు. జులనా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేశార. వినేష్‌పై బీజేపీ తరఫున మాజీ పైలట్‌ యోగేష్‌ భైరాగి బరిలో ఉన్నారు.

    సావిత్రి జిందాల్‌
    ఇక దేవంలో అత్యంత సంపన్న మహిళ అయిన సావిత్రి జిందాల్‌ హర్యానా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. హిసార్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉఆన్నరు. ఆమె హర్యానాలోని కురుక్షేత్ర బీజేపీ ఎంపీ నవీన్‌ జిందాల్‌ తలి. సావిత్రి జిందాల్‌ హర్యానాలో మంత్రిగా కూడా పనిచేశారు.