Surya Kangua movie : సూర్య ‘కంగువా’ చిత్రం ఆ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిందా..? స్టోరీ మామూలుగా లేదుగా!

ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్ విలన్ గా నటించాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి కోలీవుడ్ లో అనేక కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇది గతం లో సూర్య నటించిన '24' అనే చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోందని, టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది.

Written By: Vicky, Updated On : October 8, 2024 12:05 pm

Surya Kangua movie

Follow us on

Surya Kangua movie : సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరైన సూర్య నుండి సినిమా విడుదలై దాదాపుగా మూడేళ్లు అవుతుంది. 2022 వ సంవత్సరం మార్చి నెలలో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎలాంటి సినిమాలు తీసేవాడో సూర్య, ఇలా అయిపోయాడు అంటూ ఆయన అభిమానులు బాగా బాధపడ్డారు. ఇది సూర్య కూడా గమనించాడు. అందుకే ఈసారి అభిమానులను అసలు నిరాశపర్చకూడదు అనే ఉద్దేశ్యంతో ‘కంగువ’ చిత్రాన్ని ప్లాన్ చేసాడు సూర్య. ప్రముఖ దర్శకుడు శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం కోసం కేవలం సూర్య అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతే కాదు మన టాలీవుడ్ ఆడియన్స్ ‘బాహుబలి’ చిత్రాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, ఈ భారీ బడ్జెట్ ‘కంగువ’ చిత్రాన్ని కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.

ఇందులో దిశా పటాని హీరోయిన్ గా నటించగా, బాబీ డియోల్ విలన్ గా నటించాడు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి కోలీవుడ్ లో అనేక కథనాలు ప్రచారం అవుతున్నాయి. ఇది గతం లో సూర్య నటించిన ’24’ అనే చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతోందని, టైం ట్రావెల్ నేపథ్యంలో సాగే సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమానే, కానీ 24 చిత్రానికి ఎలాంటి లింక్ లేదని అంటున్నారు. వందల సంవత్సరాల క్రితం అడవిలో ఉండే ‘కంగువ’ అనే మహాయోధుడు, కొన్ని అనుకోని సంఘటనల కారణంగా టైం ట్రావెల్ చేసి ఆధునిక కాలం లోకి అడుగుపెడతాడు. ఇక్కడ ఆయన ఒక ప్రముఖ గూఢచారిని కలుసుకుంటాడు. అలా ఆయన టైం ట్రావెల్ చేసి ఆధునిక యుగం లోకి రావడానికి కారణం ఏమిటి?, కొత్త ప్రపంచం లోకి వచ్చిన తర్వాత ఈ మహాయోధుడితో జనాలు ఎలా కనెక్ట్ అయ్యారు అనేది ఆసక్తికరమైన అంశాలుగా ఈ చిత్రంలో నిలవబోతున్నాయి.

పాయింట్ అయితే చాలా కొత్తగా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంది. స్క్రీన్ ప్లే కూడా ఆసక్తికరంగా వుంటే మాత్రం సూర్య భారీ కం బ్యాక్ ఇచ్చినట్టే. తెలుగు లో కూడా ఆయన మార్కెట్ వరుస ఫ్లాప్స్ కారణంగా బాగా పడిపోయింది. ఈ చిత్రం తో మళ్ళీ ఆయన మార్కెట్ తిరిగి వచ్చేస్తుందని చెప్పొచ్చు. భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న సూర్య అభిమానులకు ఈ సినిమా ఒక పండుగలాగా ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రం అక్టోబర్ 10 వ తేదీన విడుదల అవ్వాల్సింది. కానీ ఆ తేదీలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వెట్టియాన్’ విడుదల అవ్వబోతుండడంతో ‘కంగువ’ ని దీపావళి కి వాయిదా వేశారు.