Ali- Pawan Kalyan: పవన్ కళ్యాణ్ -ఆలీ మధ్య ఉన్న బంధం చాలా స్ట్రాంగ్. పవన్ నటించే ప్రతీ సినిమాలో ఆలీ ఉండాల్సిందే. అందులో అలీ అవసరం లేకున్నా చివరికీ ఏదో క్యారెక్టర్ తో పవన్ సినిమాలో కనిపించేవారు. కానీ వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాలో పవన్ కనిపించలేదు. ఎందుకుంటే వీరు రాజకీయంగా విరుద్ధ పార్టీలకు చెందిన వారు. పవన్ జనసేన పార్టీ అధినేత కాగా.. ఆలీ వైసీపీలో కొనసాగుతున్నారు. ఆ మధ్య పవన్ పై ఆలీ కామెంట్స్ చేయగా.. పవన్ అందుకు కౌంటర్ వేశాడు. అయితే ఇటీవల మళ్లీ పవన్, ఆలీల గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ‘అలీతో సరదాగా’ అనే కార్యక్రమంలో ఈ కమెడియన్ అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇందులోకి పవన్ ను తీసుకొస్తాడట.. ఒకవేళ రాకపోతే వైసీపీలో పదవి వచ్చిందని చెబుతాడట..ఈ విషయం ఇప్పుడు నెట్టింట్ల హల్ చల్ చేస్తోంది.

సినిమాల్లో నటించడం తగ్గించిన ఆలీ టీవీ షో తో బిజీగా మారాడు. ఓ చానెల్ లో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి యాంకర్ గా ఆకట్టుకుంటున్నాడు. సినీ సెలబ్రెటీలను ఈ వేదికపైకి ఆహ్వానిస్తూ వారి పర్సనల్ విషయాలను చెప్పిస్తున్నాడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కూడా ఈ షోకు తప్పకుండా వస్తాడని ఇటీవల ఆలీ పేర్కొన్నాడు. ఆయనను ఎలాగైనా తన షో లో చూపిస్తానని శపథం చేశాడు. ఒక వేళ రాకపోతే తన దగ్గర ప్లాన్ బి ఉందని ఆలీ చమత్కారం చేశాడు.
‘పవన్ కు ఫోన్ చేసి నీకు వైసీపీలో పదవి వచ్చిందని చెబుతా.. అయినా వినకపోతే ఈ పదవి సీఎం తరువాత అత్యంత ప్రాముఖ్యమైందని చెబుతా.. పదవీ కోసం కాకపోయినా.. ఆ విషయంపై తేల్చుకోవడానికైనా పవన్ వస్తాడు..’ అని ఆలీ చెప్పడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన షోలో ఇప్పటి వరకు ఎందరో ప్రముఖులు వచ్చారు. కానీ పవన్ రాలేదన్న వెలితి ఉంది. ఈ వెలితిని తొందర్లోనే తీరుస్తానని ఆలీ చెప్పాడు.

అయితే బాలయ్య అన్ స్టాపబుల్ షోకు ఆహ్వానించినా తీరికలేదని చెప్పిన పవన్ ఆలీ నిర్వహించే షోకు ఎలా వస్తాడని కొందరు అంటున్నారు. అంతేకాకుండా ఆలీకి ప్రస్తుతం వైసీపీలో ఓ పదవిని కట్టబెట్టారు. దీంతో నిత్యం ఆ పార్టీని వ్యతిరేకిస్తున్న పవన్ ఆ పార్టీ నాయకుడైన ఆలీని కలుస్తారా..? అని చర్చించుకుంటున్నారు. ఒకవేళ పవన్ వచ్చినా పవన్ రాజకీయ జీవితం గురించి అడిగే ఆస్కారం ఉంది. అందువల్ల ఇక్కడికి రాకుండా ఉంటేనే బెటరని కొందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.