Munugode By Election: మునుగోడు.. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి. కానీ ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే అందరి దృష్టి కేంద్రీకృతమే ఉంది. బిజెపి, టిఆర్ఎస్ పోటాపోటీగా ప్రచారం చేశాయి. కాంగ్రెస్ కూడా చాప కింద నీళ్ల లాగా ప్రచారం చేసింది. ప్రచారానికి గడువు ముగియడంతో.. డబ్బులు పంపకానికి పార్టీలు తెరదేశాయి. మరో 24 గంటలు మాత్రమే పోలింగ్ కు మిగిలి ఉండడంతో పంపకాల పర్వం పతాక స్థాయికి చేరింది.. సోమవారం రాత్రి స్వల్పంగా ప్రారంభమైన మద్యం, డబ్బు పంపిణీ మంగళవారం సాయంత్రానికి జోరు అందుకుంది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బిజెపి, టిఆర్ఎస్ మధ్య పోరు హోరహోరిగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

డబ్బే కీలకం
ఎదుటి పార్టీ ఏ మేరకు పంచుతుందో అంచనా వేసి అదే స్థాయిలో మరో పార్టీ ఇస్తోంది. ఎదుటి పార్టీ ఏమాత్రం పెంచినా తాము అదే బాటలో వెళ్ళేందుకు వేచి చూస్తోంది. టిఆర్ఎస్, బిజెపి నేతలు ఓటుకు 3000 చొప్పున పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఎక్కువమంది ఓటర్లకు డబ్బు పంపిణీ చేయగా.. బిజెపి నాయకులు మాత్రం పక్కా టిఆర్ఎస్, సిపిఎం ఓటర్లను గుర్తించి వారిని దూరం పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో 2000 నోట్లు తక్కువ కనిపిస్తుండగా.. కోడలు మాత్రం ఎక్కువ స్థాయిలో కనిపించాయి.. ఓటర్ల నుంచి భారీ అంచనాలు ఉన్నప్పటికీ మొదటి దశలో బిజెపి, టిఆర్ఎస్ 3వేల చొప్పున మాత్రమే పంపిణీ చేశాయి. పోలింగ్ తేదీ సాయంత్రం వరకు స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని సమాచారం.

10, 000 చొప్పున ఇస్తారన్న ప్రచారం జరగడం, హోటల్ భారీగా ఆశలు పెట్టుకోవడంతో రెండవ దఫా ఎవరు ఎక్కువగా పంచుతారు అన్న చర్చలు సాగుతున్నాయి. ఓటులను సంతృప్తి పరచాలంటే రెండోదఫా ఎంతో కొంత పంచక తప్పదని కిందిస్తాయి నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు మునుగోడు మండలం పులిపలుపుల ఓటర్లకు 500 చొప్పున పంపగా స్థానిక నేతలు పంపిణీకి నిరాకరించారు. వెదురుపాటీలు పెద్ద మొత్తంలో ఇస్తుంటే తాము తక్కువ ఇస్తే నొక్కేశామని అపవాదు వస్తుందని వారు భావించారు. దీంతో నేతలు సర్దుబాటు చేసుకుని ఓటుకు వెయ్యిగా నిర్ధారించి పంపిణీ ప్రారంభించారు. అయితే ఓటుకు పదివేలు, 20వేలు అంటూ ప్రచారం జరగడం, మరికొందరు ఇంటికి తులం బంగారం ఇస్తామనడం, చివరకు 3000 ఇవ్వటంతో ఇదేంటని ఓటర్లు ప్రశ్నిస్తున్నారు. బెంగళూరు ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు రవాణా ఖర్చులు నిమిత్తం ఐదు వేల చొప్పున బదిలీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఓటర్ల నగదు పంపిణీ బాధ్యతలు అన్ని పార్టీలు స్థానికులకే అప్పగించగా.. ఓ ప్రధాన పార్టీ నగదు పంపిణీకి ఏకంగా కమిటీలను ఏర్పాటు చేసింది. ఇద్దరు స్థానికులు, ఇద్దరు స్థానికేతరులను సభ్యులుగా చేర్చింది.
పోటాపోటీ ఆ రెండు పార్టీల మధ్యే
ఇక మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి పోటీ బిజెపి, టిఆర్ఎస్ మధ్య ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన సర్వేలో నాలుగు మండలాల్లో రాజగోపాల్ రెడ్డి వైపు మొగ్గు కనిపిస్తుండగా, మిగతా మూడు మండలాలు టిఆర్ఎస్ వైపు నిలిచినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ కూడా అక్కడక్కడ ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సెట్టింగ్ ఎమ్మెల్యేనే మరో మరో ఎమ్మెల్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి. సర్వే సంస్థలు కూడా ఇదే విషయాన్ని తేల్చి చెప్పాయి. ముఖ్యంగా నిన్న జరిగిన పలిమెల ఘటన తర్వాత బిజెపి శ్రేణులు బాగా పంచుకొని క్షేత్రస్థాయిలో చాప కింద నీళ్ల లాగా పనిచేస్తున్నాయని టిఆర్ఎస్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఇక పోలింగ్ కు మరొక రోజు గడువు మాత్రమే ఉండడంతో ప్రలోభాల పర్వం తారస్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే బీజేపీకే కాస్త ఎడ్జ్ ఉండవచ్చని.. అయితే టీఆర్ఎస్ బలాన్ని తక్కువగా అంచనా వేయవద్దని అంటున్నారు. బీజేపీకి గెలుపు అవకాశాలు కాస్త ఎక్కువని తెలుస్తోంది..