KCR BRS- Jagan And Chandrababu: కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రచ్చ ఏపీలోనూ ప్రారంభమైంది. జాతీయ పార్టీ ప్రకటించిన కేసీఆర్ దానిని దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో పడ్డారు. అందులో భాగంగా సంక్రాంతి తరువాత విజయవాడ, గుంటూరులో భారీ బహిరంగ సభలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఈలోగా కొంతమంది నాయకులను బీఆర్ఎస్ లో చేర్చుకోవాలని భావిస్తున్నారు. తనతో కలిసివచ్చే వారికి స్నేహ హస్తం అందిస్తున్నారు. పార్టీలో చేరితే మంచి భరోసా కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ కు భవిష్యత్ లో ఉండే అవకాశాలు, రాజకీయ సమీకరణల గురించి వారికి వివరిస్తున్నారు. అయితే కొంతమంది కేసీఆర్ రూట్లోకి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ రావడం లేదు. కానీ కేసీఆర్ ప్రయత్నాలు మాత్రం తీవ్రస్థాయిలో జరుపుతున్నట్టు సమాచారం. అదేకానీ జరిగితే ఏ పార్టీ నేతలై ఉంటారు? అధికార పక్షంలో అసంతృప్త నేతలా? లేకుంటే విపక్షం నుంచి ఎవరైనా గోడ దూకుతున్నారా? వంటి ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

అయితే అటు కేసీఆర్ ప్రయత్నాలను గమనించిన అన్ని పార్టీలు అలెర్టవుతున్నాయి. తమ వారుఅటువైపుగా వెళ్లకుండా ముందే కట్టడి చేస్తున్నాయి. వైసీపీ ఈ విషయంలో అప్రమత్తమైంది. మంత్రులు ఇప్పుడు బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వాస్తవానికి ఏపీలో ప్రజల్లో జగన్, కేసీఆర్ లు మంచి స్నేహితులన్న భావన ఉంది. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టారని మెజార్టీ ప్రజలు విశ్వసిస్తున్నారు.
Also Read: Heavy Rains In Telangana: తెలంగాణలో రెండు రోజులు కుండపోత వర్షాలు.. అరెంజ్ అలర్ట్ జారీ
జగన్ కు తెలియకుండా కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటిస్తారా? ఏపీలో పార్టీని విస్తరిస్తారా? అన్న ప్రశ్న అయితే ఉత్పన్నమవుతోంది. అందుకే ఇప్పుడు వైసీపీ అధిష్టానం జాగ్రత్త పడింది. అసలు తమకు కేసీఆర్ జాతీయ పార్టీతో ఎటువంటి సంబంధం లేదని.. వారిని కూడా రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తామని మంత్రులు స్పష్టం చేస్తున్నారు. ఒక వేళగతంలో మాదిరిగా కేసీఆర్ తో స్నేహం ఉన్నట్టు తేలితే తమకు ముప్పు ఖాయమని వైసీపీ నేతలు భావిస్తున్నారు.

అదే సమయంలో చంద్రబాబు కూడా అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ప్రభావం ఉండదని భావిస్తున్నా.. ఒక వేళ ఏపీలో కేసీఆర్ ఎంటరైతే కలిసేవారెవరని ఆరా తీస్తున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా టీడీపీపైనే పడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేసీఆర్ పూర్వశ్రమం టీడీపీ. అప్పట్లో తనతో కలిసి నడిచిన నాయకులను బీఆర్ఎస్ గూటికి చేర్చాలని కేసీఆర్ భావిస్తున్నారు. అయితే ఆయన సమకాలికులు ఇప్పుడు రాజకీయంగా దాదాపు రిటైర్ అయ్యారు. వారసులు రంగంలో ఉన్నారు. వారు ఇప్పటికే టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. వారు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వైపు వెళ్లరని చంద్రబాబు భావిస్తున్నారు. అయినా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని భావించే చంద్రబాబు ఆదిలోనే బీఆర్ఎస్ ప్రభావం తన పార్టీపై పడకుండా కట్టడి చేయాలని చూస్తున్నారు. అందుకే పార్టీ ముఖ్యులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. బీఆర్ఎస్ పై ఎటువంటి కామెంట్లు చేయవద్దని.. ఆచీతూచీ వ్యవహరిద్దామని చెప్పే అవకాశముందిని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: IT Jobs Requirements: ఐటీ షాక్.. నియామకాలు తగ్గుముఖం.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కూడా లేవే?
[…] […]