కరోనా ఎంత కలవరపెట్టిందో అందరికి తెలిసిందే. దేశం మొత్తం కరోనా వైరస్ ప్రభావంతో అన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. లాక్ డౌన్ నిబంధనలతో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు నానా తంటాలు పడ్డాయి. కరోనా నుంచి కాపాడుకునేందుకు ప్రజలు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలను బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని అన్నిజిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొవిడ్ పరిస్థితులపై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఆళ్ల నాని, బొత్స సత్యనారాయణ, ఉన్నతాధికారులతో చర్చించారు. జిల్లాల వారీగా కేసుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం కర్ఫ్యూ పై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ర్టవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయనుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపు ఇచ్చారు. రాత్రి 9 గంటలకు దుకాణాలు మూతపడాలి. నిబంధనలు పాటించని దుకాణాలపై 2-3 రోజులు మూసి వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ఉల్లంఘనపై ఫొటో తీసి పంపినా దుకాణాలు తీసినా జరిమానాలు విధించాలని తెలిపింది.
ఫొటోలు పంపేందుకు ప్రత్యేక వాట్సాప్ నంబరును ఏర్పాటు చేశారు. మరో వైపు ప్రజలు గుమిగూడకుండా 144 సెక్షన్ ను కఠినంగా అమలు చేయనున్నారు. మార్కెట్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు దరించాలని సూచించింది. మాస్కులు లేకపోతే రూ.100 జరిమానా విదించాలని స్పష్టం చేసింది. కరోనా నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరింది. బహిరంగ ప్రదేశాల్లో జాగ్రత్తగా మసలు కోవాలని పేర్కొంది.