https://oktelugu.com/

భారత్ లో జనాభా పెరుగుదలకు అమీర్ ఖాన్ కారణమట

దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు మొదటి స్థానానికి పోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. జనాభా నియంత్రణపై ఎవరికి పట్టింపు లేకుండా పోతోంది. దీంతో పలు కష్టాలు ఎదురవుతున్నాయి. చైనా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ఇప్పటికే చైనా జనాభా నియంత్రణపై పట్టు సాధించడంతో ఇండియా పరిస్థితి ఘోరంగా తయారయ్యే అవకాశం ఏర్పడుతోంది. భారత్ లో జనాభా పెరగడానికి కారణం బాలీవుడ్ సినీ నటుడు అమీర్ ఖాన్ లాంటి […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 12, 2021 / 05:42 PM IST
    Follow us on

    దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న ఇండియా ఇప్పుడు మొదటి స్థానానికి పోయినా ఆశ్చర్యపోనక్కరలేదు. జనాభా నియంత్రణపై ఎవరికి పట్టింపు లేకుండా పోతోంది. దీంతో పలు కష్టాలు ఎదురవుతున్నాయి. చైనా మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానాన్ని భారత్ ఆక్రమించింది. ఇప్పటికే చైనా జనాభా నియంత్రణపై పట్టు సాధించడంతో ఇండియా పరిస్థితి ఘోరంగా తయారయ్యే అవకాశం ఏర్పడుతోంది.

    భారత్ లో జనాభా పెరగడానికి కారణం బాలీవుడ్ సినీ నటుడు అమీర్ ఖాన్ లాంటి వారే నని మధ్యప్రదేశ్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొదటి భార్యతో ఇద్దరు పిల్లల్ని కన్నాక ఆమెకు విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా ఓ బిడ్డను కన్నారు. ఇప్పుడు మూడో భార్య కోసం వెతుకుతున్నారన్నారు. ఇన్ని వివాహాలు, పిల్లల్ని కంటున్న ఆయన భారత్ కు ఇచ్చే సందేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

    ఇటీవల అమీర్ ఖాన్ తన రెండో భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకోనున్న విషయం తెలిసిందే. దీనిపై ఆదివారం జనాభా నియంత్రణ దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ సుధీర్ గుప్తా మాట్లాడుతూ దేశంలో జనాభా అసమానతలకు అమీర్ ఖాన్ లాంటి వారే కారణం కావడం దురదృష్టకరమన్నారు. గత పదేళ్లలో భారత భూభాగం పెరగకపోయినా జనాభా మాత్రం పెరిగిపోయిందన్నారు. ఇది దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు. దేశ విభజన సమయంలో ఎక్కువ భూభాగం తక్కువ జనాభాతో పాకిస్తాన్ ఏర్పడిందన్నారు.

    జనాభా నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. అమీర్ ఖాన్ కిరణ్ రావుల 15 ఏళ్ల వైవాహిక జీవితానికి చరమగీతం పాడనున్నారు. వైవాహిక జీవితంలో తమ కుమారుడు ఆజాద్ రావు ఖాన్ ను సరోగసీ ద్వారా కన్నారన్నారు. కిరణ్ రావును వివాహం చేసుకోకముందు అమీర్ రీనా దత్తాను వివాహం చేసుకున్నారన్నారు. వారికి జునైద్ అనే కొడుకు, ఇరా అనే కుమార్తె అనే ఇద్దరు పిల్లలున్నారన్నారు.